ప్రస్తుతం మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ మార్చిలో మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)పెట్టుబడులు మొదటిసారిగా రూ. 14,000 కోట్ల మార్కును దాటాయి. ఏప్రిల్ 1 నుంచి పన్ను నిబంధనలను మార్చడానికి ముందు పెట్టుబడిదారులు ఈ ఫండ్‌లలో డబ్బును పెట్టడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. మార్చిలో, రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో రూ. 14,276 కోట్లు పెట్టుబడి పెట్టారు. జనవరిలో గరిష్టంగా నెలవారీగా వచ్చిన రూ. 13,856 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువ.
మార్చి నెలలో దాదాపు 22 లక్షల కొత్త SIP లు నమోదు కాగా, మొత్తం ఖాతాలు దాదాపు 6. 4 కోట్లుగా ఉన్నాయి. మార్చి 2020లో SIP ఖాతాల సంఖ్య 3 కోట్ల నుంచి రెండింతలు పెరిగింది.ప్రపంచ భౌగోళిక రాజకీయ కారణాలు మరియు ద్రవ్యోల్బణం కారణంగా అస్థిరత ఉన్నప్పటికీ, మహమ్మారి అనంతర కాలంలో ఇన్వెస్టర్లలో పెరుగుదల కనిపించిందని యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ ఎస్ వెంకటేష్ చెప్పారు. ఇది స్థిరమైన పెట్టుబడిదారుల ప్రవర్తనకు సూచనగా పేర్కొన్నారు.

FY23 సమయంలో అస్థిరమైన మార్కెట్ ఉన్నప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కలిసి రూ. 2 లక్షల కోట్లకు పైగా నికర ఇన్‌ఫ్లోలు వచ్చాయి. మార్చి 2023లో కార్పొరేట్ బాండ్ పథకాల్లోకి రూ. 15,600 కోట్ల నికర ఇన్‌ఫ్లోలు, బ్యాంకింగ్ & పీఎస్‌యూ పథకాల్లోకి దాదాపు రూ. 6,500 కోట్లు, డైనమిక్ బాండ్ ఫండ్లలో మరో రూ. 5,661 కోట్లు వచ్చాయి. లిక్విడ్ ఫండ్స్ దాదాపు రూ. 57,000-కోట్ల నికర అవుట్‌ఫ్లో వెళ్లాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications