స్టాక్ మార్కెట్లపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య ఈ మధ్యకాలంలో క్రమంగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టే అంత పరిజ్ఞానం లేని వారు మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకుంటున్నారు. ఈ సంస్థలు రిటైల్ ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణమైన పథకాలను తీసుకువస్తున్నాయి. ఈ సంస్థలు అందించే క్రమానుగత పెట్టుబడి ప్లాన్ల (సిప్) వల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్నారు. సిప్ పెట్టుబడుల్లో ధోరణులను పరిశీలిస్తే వీటిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చూసుకోవచ్చు.
అక్టోబర్ లో రూ.8,246 కోట్లు
* సిప్ ల ద్వారా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ గత అక్టోబర్ లో 8,246 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలతో పోల్చితే ఈ పెట్టుబడులు 3.2 శాతం మేర పెరిగాయి.

* ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు స్టాక్ మార్కెట్లో దూసుకుపోవడానికి దోహదపడినాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సిప్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు.
* ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు సిప్ పెట్టుబడులు 52,472 కోట్ల నుంచి 57,607 కోట్లకు పెరిగాయి.
* రిస్క్ తక్కువగా ఉండటం వల్ల ఇన్వెస్టర్లు సిప్ లకు ప్రాధాన్యం ఇస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
* ప్రస్తుతం 44 కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ ను అందిస్తున్నాయి. ఈ సంస్థలు సిప్ ల ద్వారా గత సెప్టెంబర్ లో 8,263 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. ఆగస్టులో 8,231 కోట్లు, జులై లో 8,324 కోట్లు, జూన్ లో 8,122 కోట్లు, మే లో 8,183 కోట్లు, ఏప్రిల్ లో 8,238 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* అక్టోబర్ తో ముగిసిన పన్నెండు నెలల కాలాన్ని పరిశీలిస్తే సిప్ లోకి వచ్చిన సగటు పెట్టుబడులు 8,000 కోట్లుగా ఉన్నాయి.
* పెట్టుబడులు పెరగడం ఇన్వెస్టర్ల సానుకూల దృక్పథాన్ని తెలియజేస్తోంది.
మార్కెట్ల పని తీరు మెరుగు...
దేశ ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి మందగిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం పలు రకాల ఉద్దీపనలు ప్రకటిస్తోంది. వీటి ప్రభావం రానున్న కాలంలో సానుకూలంగగా ఉంటుందని.. దీంతో మార్కెట్లు మరింత ముందడుగు వేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
* ఫలితంగా సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెరుగుతాయంటున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు బీఎస్ఈ దాడ్పు నాలుగు శాతం వరకు పెరిగింది.
గత మూడేళ్ళలో...
* గత మూడేళ్ళ నుంచి సిప్ ల ద్వారా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇవి సిప్ లకు ఉన్న ఆదరణను తెలియజేస్తున్నాయి.
* 2018-19 లో 92,700 కోట్లు, 2017-18లో 67,000 కోట్లు, 2016-17లో 43,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* ప్రస్తుతం సిప్ ఖాతాలు 2.89 కోట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు.
* ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సగటున నెలలో 9.35 లక్షల సిప్ ఖాతాలను జతచేసుకున్నాయి. వీటి సగటు పెట్టుబడుల మొత్తం 2,850 రూపాయలుగా ఉంది.
* అక్టోబర్ చివరి నాటికీ మ్యూచువల్ ఫండ్ కంపెనీల మొత్తం ఆస్తులు 26 లక్షల కోట్లకు పెరిగాయి.
సిప్ పెట్టుబడి ఇలా..
* సిప్ ల ద్వారా ఇన్వెస్టర్లు ఒక్కసారి భారీగా కాకుండా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లు వారం, నెల లేదా మూడు నెలలకు ఒక్కసారీ పెట్టుబడులు పెట్టవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది బ్యాంకు రికరింగ్ డిపాజిట్ లాంటిదే.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications