రూ.1.12 లక్షల కోట్ల నుంచి రూ.55,700 కోట్లకు.. ఈక్విటీలలో సగానికి తగ్గిన MF పెట్టుబడులు
న్యూఢిల్లీ: 2019లో జనవరి నుంచి అక్టోబర్ నెలల మధ్య మ్యూచువల్ ఫండ్స్‌లు భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం సగానికి సగం పడిపోయింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన బలహీనంగా ఉండటంతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈక్విటీల్లో రూ.55,700 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశాయి. ఈ మేరకు సెబీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే గత ఏడాది ఇదే కాలంలో స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ల ద్వారా దాదాపు రూ.1.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

వారి భాగస్వామ్యం లేకుంటే...
రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు తగ్గడంతో ఆయా సంస్థలు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం తగ్గించాయని ప్రైమ్ ఇన్వెస్టర్.ఇన్ సహ వ్యవస్థాపకులు విద్యా బాల అన్నారు. స్టాక్ మార్కెట్లు లైఫ్ టైమ్ హైకి చేరుకున్నప్పటికీ కొన్ని షేర్లు మాత్రమే పెరుగుతున్నాయని, రిటైల్ ఇన్వెస్టర్ల సంపద పెరగలేదని, దీంతో వారు అంత ఉత్సాహంగా లేరని, అలాంటి వారి భాగస్వామ్యం లేకుంటే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశముందన్నారు.

FPI విక్రయాలు జరిగినప్పుడే...
ఈ సంవత్సరం ఈక్విటీల్లోకి వచ్చిన రూ.55,700 కోట్లలో ప్రధానంగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లోనే వచ్చింది. ఈ మూడు నెలల్లో దాదాపు రూ.43,500 కోట్లకు పైగా వచ్చాయి. FPIలు మార్కెట్ల నుంచి రూ.22,400 కోట్లు వెనక్కి వెళ్లాయి. FPIలు విక్రయాలు జరిగినప్పుడు భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయంగా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు భావిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈక్విటీల నుంచి దాదాపు రూ.12,000 కోట్ల పెట్టుబడులను ఫండ్ మేనేజర్లు వెనక్కి తీసుకున్నారు.

పాజిటివ్‌గా ఉంది...
ఈక్విటీలలో నెలలో ప్రవాహం సానుకూలంగా ఉన్నాయని, సిప్ ఇన్‌ఫ్లో నిలిపివేస్తే నెగిటివ్ అవుతుందని, అప్పుడు పెట్టుబడులు తక్కువ అవుతాయని చెబుతున్నారు. సిప్ ఓ పెట్టుబడి వాహకం. నెలవారీ, మూడు నెలలు, ఆరునెలల వారీగా ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిని ఒకేసారి చెల్లిస్తారు. వీటి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌కు నిధులు వస్తాయి.


Click it and Unblock the Notifications