మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు ఒక ప్రముఖ అప్షన్. ఇవి పెద్ద మొత్తం కూడబెట్టడానికి, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి అనుకూలమైన మార్గం. అయితే, మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే, అతని పెట్టుబడి ఏమవుతుంది ? ఈ డబ్బును ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఈ ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి...

నామినేషన్ : ఇతర పెట్టుబడి అప్షన్స్ లాగానే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిదారులు నామినీని నియమించుకునే అవకాశం ఉంది. పెట్టుబడిదారుడు మరణించిన సందర్భంలో నామినీ ఈ డబ్బు పొందేందుకు అర్హులు. మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు నామినీని నియమించడం ద్వారా క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభతరం అవుతుంది. నామినీకి మ్యూచువల్ ఫండ్ మొత్తాన్ని పొందే హక్కు ఉంటుంది.
నామిని లేకపోతే ఎం జరుగుతుంది: పెట్టుబడిదారులు నామినీని నియమించకపోతే, అతని మరణం తర్వాత క్లెయిమ్ ప్రక్రియ కొంత క్లిష్టంగా మారుతుంది. అయితే ఈ పరిస్థితిలో కూడా డబ్బు ఎక్కడా చిక్కుకోదు. ఇలాంటి సందర్భంలో పెట్టుబడిదారుడి చట్టపరమైన వారసులు మ్యూచువల్ ఫండ్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
వారసులకు అవసరమైన డాకుమెంట్స్ :
* మరణించిన ధృవీకరణ పత్రం (Death Certificate)
* వారసత్వ ధృవీకరణ పత్రం (Succession Certificate) లేదా వీలునామా (Will) - ఒకవేళ ఉంటే
* చట్టపరమైన వారసుడి గుర్తింపు కార్డు (ID Proof)
* అడ్రస్ ప్రూఫ్ (Address Proof)
* మ్యూచువల్ ఫండ్ ఫోలియో నంబర్, ఇతర సంబంధిత సమాచారం.
డబ్బును క్లెయిమ్ చేసే ప్రక్రియ: ముందుగా, పెట్టుబడిదారుడి మరణం గురించి సంబంధిత మ్యూచువల్ ఫండ్ కంపెనీకి (లేదా AMCకి) తెలియజేయాలి. దీనిని నామినీ లేదా చట్టపరమైన వారసుడు చేయవచ్చు. నామినీ అయితే, పెట్టుబడిదారునికి సంబంధించిన అన్ని అవసరమైన పత్రాలు (మరణ ధృవీకరణ పత్రం, KYC పేపర్స్, ఫోలియో నంబర్) సబ్మిట్ చేయాలి. దీనితో పాటు, క్లెయిమ్ ఫామ్‌ను కూడా సబ్మిట్ చేయాలి. పెట్టుబడిదారుడికి నామినీ లేకపోతే వారసులు పైన పేర్కొన్న అన్ని డాకుమెంట్స్ సమర్పించాలి. మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీ డాకుమెంట్స్ వెరిఫై చేసి డబ్బు నామినీ లేదా చట్టపరమైన వారసుడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ పూర్తయిన తర్వాత నామినీ లేదా వారసుడు డబ్బు మొత్తం రీడీమ్ చేసుకోవచ్చు.
నామినీకి, వీలునామాకు మధ్య తేడా: చాలా మంది నామినీ, వీలునామా ఒకటే అని భావిస్తారు, కానీ రెండింటికీ చాలా తేడా ఉంది. ఒక పెట్టుబడిదారుడు నామినీని నియమిస్తే, ఆ నామినీ ట్రస్టీ లాగా వ్యవహరిస్తారు. అంటే అతను మ్యూచువల్ ఫండ్ డబ్బును పొందే హక్కు ఉంటుంది, కానీ వీలునామాలో పేర్కొన్న విధంగా లేదా చట్టపరమైన వారసులకు ఆ డబ్బును పంచాలి. పెట్టుబడిదారుడు వీలునామా చేసి ఉంటే అందులో పేర్కొన్న సూచనల ప్రకారం డబ్బు పంచడం చేయబడుతుంది.


Click it and Unblock the Notifications