Multibagger: మల్టీబ్యాగర్ రిటర్న్స్‌తో మతిపోగొడుతున్న ప్రభుత్వం రంగ స్టాక్.. మీ దగ్గర ఉందా?
BHEL: ప్రభుత్వ రంగ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలంటూ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే వాస్తవ పరిస్థితి అనుకున్న రేంజ్‌లో అయితే లేదు. కానీ ఓ ప్రభుత్వ రంగ స్టాక్ మాత్రం దుమ్ముదులిపే రిటర్న్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది.
ఎలక్ట్రానిక్స్ సహా డిఫెన్స్ రంగాల్లో సేవలిందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL) షేర్లు గురువారం ట్రేడింగ్ లో అప్పర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి. అయితే దీనికి మోదీ లేదా BJP హవా అయితే కారణం కాదు. ప్రముఖ భారతీయ కంపెనీ అదానీ పవర్ నుంచి భారీ డీల్ రావడంతో ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది.

ఏకంగా 3 వేల 500 కోట్లు విలువైన పెద్ద ఆర్డర్ ను BHEL సొంతం చేసుకోవడంతో ఇన్వెస్టర్లు యాక్టివ్ అయ్యారు. రాయ్ పూర్ లో 1.6 K MW సామర్థ్యంతో కూడిని థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అదానీ కంపెనీ ఈ ఆర్డర్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఇరు కంపెనీలు ఒప్పందంపై సంతకం చేశాయి.
దీంతో BHEL షేర్ ధర గురువారం ఉదయం 10 శాతం అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయింది. శుక్రవారం మార్కెట్ సమయం ముగిసే నాటికి మరో 2.54 శాతం పెరిగి చివరికి 285 వద్ద స్థిరపడింది. 52 వారాల గరిష్ఠ స్థాయి 322 కాగా.. కనిష్ఠం 82 గా ఉంది. గడిచిన 6 నెలల్లో అయితే 52 శాతం పెరిగింది. గతేడాది కాలంలో చూసుకుంటే ఏకంగా 230 శాతం రిటర్న్స్‌తో మల్టీబ్యాగర్ గా అవతరించింది. రానున్నరోజుల్లో కొత్త గరిష్ఠాలకు చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications