IPO News: తొలిరోజే నిండా ముంచి ఐపీవో.. నిరాశలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు.. మీరూ కొన్నారా..??
Muthoot Microfin IPO: ఈరోజు మార్కెట్లు కొంత ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. దీంతో లిస్ట్ అయిన రెండో ఐపీవో ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే..
ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో నేడు జాబితా చేయబడ్డాయి. ఈ క్రమంలో స్టాక్ తగ్గింపు ధర వద్ద లిస్టింగ్ జరగటంతో ఇన్వెస్టర్లు షాక్ అయ్యారు. బీఎస్ఈలో ఐపీవో రూ.278 రేటు వద్ద జాబితా చేయబడింది. ఇది కంపెనీ వాస్తవ ఇష్యూ రేటు రూ.291 కంటే 4.47 శాతం తక్కువ కావటం గమనార్హం. ఇదే క్రమంలో స్టాక్ ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర కంటే 5.3 శాతం తక్కువ ధర రూ.275.30 వద్ద జాబితా అయ్యింది. దీంతో ముత్తూట్ మైక్రోఫిన్ గ్రూప్ B సెక్యూరిటీలలో జాబితా చేయబడింది.

ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 20 వరకు తెరచి ఉంది. కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా రూ.960 కోట్లను సమీకరించింది. ఇష్యూ మెుత్తంగా 11.50 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల కోసం రిజర్వ్ కోటా 17.47 రెట్లు, NII విభాగం 13.20 రెట్లు, రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ 7.61 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఐపీవో కోసం కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.277-291గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిణామం 51 షేర్లుగా నిర్ణయించింది.

కంపెనీ ఆర్థిక పనితీరును పరిశీలిస్తే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 72 శాతం పెరిగి రూ.1,042 కోట్లకు చేరుకుంది. అలాగే సెప్టెంబరు 2023తో ముగిసే ఆరు నెలలకు లాభం రూ.205 కోట్లకు చేరుకుంది. ముత్తూట్ మైక్రోఫిన్ భారతదేశంలో ఐదవ అతిపెద్ద NBFC-MFI, దక్షిణ భారతదేశంలోని NBFC-MFIలలో మూడవ అతిపెద్దది. MFI మార్కెట్ వాటా పరంగా కేరళలో అతిపెద్దది. తమిళనాడులో దాదాపు ఆధిపత్య ప్లేయర్. మార్చి 2023 నాటికి 16% మార్కెట్ వాటాను కలిగి ఉంది. దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 339 జిల్లాల్లోని 1,340 శాఖలలో 12,297 మంది ఉద్యోగుల ద్వారా సేవలందిస్తున్న 31.9 లక్షల మంది క్రియాశీల కస్టమర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications