కేరళకు చెందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ముత్తూట్ ఫిన్‌కార్ప్ తెలుగు రాష్ట్రాల్లో భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు ఇప్పటి వరకు 3,600 శాఖలు ఉండగా, 70 శాతం దక్షిణ భారత దేశంలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 3 లక్షల మందికిపైగా ఖాతాదారులను కలిగి ఉన్న ముత్తూట్ ఫిన్‌కార్ప్‌కు ప్రస్తుతం 265 శాఖలు ఉండగా, కొత్తగా మరో 60 శాఖలు ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉంది.
కొత్త శాఖల ఏర్పాటు ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలని భావిస్తున్నట్లు ముత్తూట్ ఫిన్‌కార్ప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వాసుదేవన్ రామస్వామి తాజాగా వెల్లడించారు. ముత్తూట్ ఫిన్‌కార్ప్ రుణాల్లో ఎక్కువ భాగం ఆభరణాల తనఖాపై ఇచ్చేవేనని, ఈ రకం రుణాలపై వడ్డీ రేటు 12-20 శాతం వరకు ఉంటోందని, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎస్ఎంఈ) రుణాల విభాగంలోనూ విస్తరించడంపై దృష్టి సారించామని రామస్వామి తెలిపారు.

అంతేకాదు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ తన అజమాయిషీలో ఉన్న ఆస్తుల మొత్తాన్ని 15-17 శాతం మేర పెంచుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం రూ.12,300 కోట్ల నగదు ఆస్తులను నిర్వహిస్తున్నట్లు గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ ఆస్తులు 16 శాతం పెరిగాయని, పరిశ్రమ సగటు వృద్ధి 13-14 శాతంకాగా, తాము అంతకంటే ఎక్కవ వృద్ధిని నమోదు చేశామని ఆయన చెప్పారు.
కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారం...
ముత్తూట్ ఫైనాన్స్ కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. రూ.215 కోట్లతో ఐడీబీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఐడీబీఐ ఏఎంసీ), ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ట్రస్టీ కంపెనీలో నూరు శాతం ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఐడీబీఐ ఏఎంసీ 2010లో ఏర్పాటు కాగా, రూ.5,300 కోట్ల పెట్టుబడులు నిర్వహణలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక ఒప్పందం కూడా చేసుకున్నామని, ఈ డీల్‌కు సెబీ తదితర నియంత్రణ సంస్థల ఆమోదం అవసరమని, వచ్చే ఫిబ్రవరి నాటికి ఈ కొనుగోలు పూర్తవుతుందని ముత్తూట్ ఫైనాన్స్ పేర్కొంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications