Muthoot Finance: మన దేశంలో ప్రజలకు బంగారం అంటే ఎంత పిచ్చో మనందరికీ తెలుసు. అలాంటిది బహుమతుల రూపంలో ఎవరైనా గోల్డ్ ఇస్తానని చెబితే మన ఆనందానికి హద్దే ఉండదు. కానీ.. మనందరికీ తెలిసిన ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ఇలా తన కస్టమర్లకు ఏకంగా 100 కిలోల బంగారాన్ని బహకరించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని మీరు పసిడిని సొంతం చేసుకోండి. ఈ గోల్డెన్ ఆఫర్ అస్సలు వదులుకోకండి..

ముత్తూట్ ఫైనాన్స్..
గోల్డ్ లోన్ వ్యాపారంలో ఉన్న NBFC ముత్తూట్ ఫైనాన్స్ ఆగస్టు 23, 2022 తన కస్టమర్ల కోసం 'మిల్లీగ్రామ్ రివార్డ్ ప్రోగ్రామ్'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ రివార్డ్ ప్రోగ్రామ్ కింద ముత్తూట్ గ్రూప్‌తో జరిగే అన్ని లావాదేవీలకు కనీసం ఒక మిల్లీగ్రాము బంగారం రివార్డ్ రూపంలో కస్టమర్లు పొందుతారని స్పష్టం చేసింది.

దేశంలో తొలిసారిగా.. వేటిపై ఇలా..
కస్టమర్లతో సంబంధాన్ని బలోపేతం చేసుకోవటంతో పాటు, సంస్థను వీడిన వారిని తిరిగి తీసుకురావడం లక్ష్యంగా దీనిని ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. దేశంలో మొదటిసారిగా 24 క్యారెట్ల బంగారంతో.. 30 ప్లస్ సర్వీస్‌లకు కస్టమర్ రివార్డ్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నట్లు NBFC తెలిపింది. గోల్డ్ లోన్ తీసుకున్నా లేక గోల్డ్ లోన్ వడ్డీలను తిరిగి చెల్లించినా రివార్డు అందుకోవచ్చు.

వేరే వారిని రిఫర్ చేస్తే..?
ఇక కంపెనీకి వేసే కస్టమర్లను రిఫర్ చేసేవారిని సైతం రివార్డులు వరిస్తాయి. కంపెనీతో జరిగే ప్రతి కస్టమర్ రిఫరల్ లావాదేవీకి 20 మిల్లీగ్రాముల బంగారాన్ని కూడా సంపాదిస్తారని కంపెనీ తన ప్రకటనలో స్పష్టంగా తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా కంపెనీ రూ.50 కోట్లు విలువైన 100 కిలోల బంగారాన్ని గిఫ్ట్ రూపంలో అందించనుంది.

ఎప్పటి నుంచి అమలు..
ఏప్రిల్ 01, 2022 నుంచి చేసిన అన్ని లావాదేవీలకు 'మిల్లీగ్రామ్ రివార్డ్ ప్రోగ్రామ్' అమలులోకి వస్తుంది. దీనికి సంబంధించి స్కీమ్స్ విషయంలో పాటించాల్సిన ప్రమాణాలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. కస్టమర్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని తెలిపేందుకు ఇది చిన్న మార్గమని MD జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ అన్నారు.

కొత్త కస్టమర్లను పెంచుకునేందుకు..
ఈ ప్రయత్నం ద్వారా కొత్తగా కస్టమర్లను తిరిగి పొందాలని కంపెనీ నిర్ణయించుకుంది. అందువల్ల ఇప్పటికే ఉన్న కస్టమర్లలో ఎవరైనా ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో లేదా దాని ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా వ్యక్తిగతంగా రిఫరల్ ఫారమ్‌ను సమర్పించవచ్చని తెలిపింది. అప్పుడు మిల్లీగ్రామ్ గోల్డ్ పాయింట్‌లు రిఫరర్‌కు క్రెడిట్ చేయబడతాయి. అయితే బహుమతి బంగారాన్ని అందించటం కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి జరుగుతుందని కంపెనీ వెల్లడించింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications