Muthoot Finance: ఎన్నారైలకు శుభవార్త.. ముత్తూట్ ఫైనాన్స్ కొత్త సర్వీస్.. తక్కువ ఖర్చుతోనే..
Muthoot Finance: ప్రవాస భారతీయులకు శుభవార్త. NRIల బంధువులు స్వదేశంలో తీసుకున్న బంగారు రుణాల EMIలు చెల్లించడం ఇకపై సులభతరం అయింది. గోల్డ్ లోన్ EMI చెల్లింపులను సులభతరం చేయడానికి ముత్తూట్ ఫైనాన్స్ తన కలెక్షన్ పార్ట్నర్‌గా పనిచేయడానికి UAE ఆధారిత లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ యూఏఈలో ప్రముఖ నగదు మార్పిడి, బదిలీ కంపెనీల్లో ఒకటిగా ఉంది.

4 లక్షల మందికి ప్రయోజనం..
ఈ డీల్ వల్ల ముత్తూట్ గ్రూప్‌కు చెందిన సుమారు 4 లక్షల మంది కస్టమర్లకు ఈ ప్రయోజనం అందనుంది. ఈ వినియోగదారులు లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ కు సంబంధించిన 89 శాఖల ద్వారా లోన్ అకౌంట్లకు తక్షణమే డబ్బును చెల్లించవచ్చు. చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయటాన్ని ఇది సులభతరం చేస్తుందని ముత్తూత్ సంస్థ వెల్లడించింది.

ఏఏ రాష్ట్రాల్లో కస్టమర్లు..
దేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటకలకు రెమిటెన్స్‌ల వాటా ఎక్కువగా ఉండటంతో కస్టమర్ల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. లులు ఎక్స్ఛేంజ్ UAE అంతటా శాఖలను కలిగి ఉంది. ఈ శాఖల ద్వారా రియల్ టైంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం లభించింది. భారతదేశంలోని ముత్తూట్ ఫైనాన్స్‌కు చెందిన 4600 బ్రాంచ్‌లలో ఎక్కడి లోన్ ఖాతాకైనా నేరుగా డబ్బు పంపువచ్చు. ఇది ముత్తూట్ గ్రూప్ USA వెంచర్ అయిన ముత్తూట్ ఫిన్‌సర్వ్ భాగస్వామ్యంతో సాధ్యమైంది

రీపేమెంట్స్..
ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం క్రాస్-బోర్డర్ రీపేమెంట్ అనుభవాన్ని వేగంగా మరియు మరింత నమ్మదగినదిగా మెరుగుపరుస్తుంది. ఈ సేవను అతి త్వరలో డిజిటలైజ్ చేయాలని గ్రూప్ యోచిస్తోందని లులూ ఫైనాన్షియల్ గ్రూప్ సీఈవో రిచర్డ్ వాసన్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications