Muthoot Finance: వినూత్న సాయంతో ముందుకొచ్చిన ముత్తూట్ ఫైనాన్స్.. వితంతువులకు బంపర్ ఆఫర్

CSR Initiative: ఆయా కార్పొరేట్ సంస్థలు తమ లాభాల్లో కొంత మొత్తాన్ని సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. పలు కంపెనీలు ఈ నగదును స్కాలర్‌షిప్స్, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యకలాపాలపై ఖర్చు చేస్తుంటారు. అయితే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది.

'వివాహసన్మానం' పేరిట ముత్తూట్ ఫైనాన్స్ ఓ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. CSR ఇనీషియేటివ్ కింద ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని ద్వారా వితంతువుల కుమార్తెల వివాహం కోసం ఆర్థిక సహాయాన్ని అందించాలని భావిస్తోంది. ఒక్కో లబ్ధిదారునికి 50 వేలు సాయం చేయాలని చూస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, మధురై, మంగళూరు, ముంబై, కోల్‌కతా మరియు ఢిల్లీ వంటి నగరాల నుంచి మొత్తం 80 మందికి చేయూత ఇవ్వనుంది. ఒక్కోచోట నుంచి గరిష్ఠంగా 10 మందికి ఈ బెనిఫిట్ అందించనుంది.

Muthoot Finance inviting applications for financial support to widowed mothers daughters

దీన్ని పొందేందుకు సంస్థ కొన్ని అర్హతలను నిర్ణయించింది. లబ్ధిదారుల నెలవారీ ఆదాయం 10 వేల కంటే తక్కువగా ఉండాలని తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 40 లక్షల గ్రాంట్‌ను అలాట్ చేసినట్లు చెప్పింది. అయితే ఇప్పటికే వితంతు తల్లులకు వారి కుమార్తెల వివాహ సహాయం కింద 15 కోట్లను అందించడం గమనార్హం.

'వివాహాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నాయని గుర్తించాం. ఆర్థిక సవాళ్లతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాల బాధను మేము అర్థం చేసుకున్నాం. వితంతు తల్లులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారిపై ఒత్తిడిని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. వారి ఉజ్వల భవిష్యత్తుకు ముత్తూట్ ఫైనాన్స్ సాయం చేయాలని నిర్ణయించింది' అని సంస్థ CSR హెడ్ బాబు జాన్ మలయిల్ తెలిపారు.

అర్హత కలిగిన యువతులు తల్లులు ఈ క్రింది డాక్యుమెంట్‌లతో పాటు దరఖాస్తును సమర్పించాలని కోరారు. డిసెంబర్ 25 సాయంత్రం 5.30లోపు వారికి చేరేలా పంపించాలని అడ్రస్ ఇచ్చారు. దరఖాస్తు ఎన్వలప్‌పై 'వివాహ బహుమతి కోసం దరఖాస్తు' అని స్పష్టంగా రాయాలని సూచించారు.

కావాల్సిన డాక్యుమెంట్లు:
1. ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌ని ఉద్దేశించి తెల్ల కాగితంపై అభ్యర్థన లేఖ.
2. స్థానిక కౌన్సిలర్/పంచాయతీ సభ్యులు/ఎమ్మెల్యే నుంచి సిఫార్సు లేఖ.
3. వివాహ ఆహ్వానం లేదా వివాహ తేదీని సూచించే లేఖ లేదా దరఖాస్తు చెల్లుబాటును బలపరిచే ఏదైనా పత్రం
4. రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు కాపీ
5. ఆదాయ ధృవీకరణ పత్రం
6. మరణ ధృవీకరణ పత్రం లేదా కుమార్తె తల్లి వితంతువు లేదా ఒంటరి తల్లి అని రుజువు చేసే ఏదైనా డాక్యుమెంట్

చిరునామా:
దిలీప్ కుమార్, మేనేజర్ CSR
ది ముత్తూట్ గ్రూప్, MG జార్జ్ ముత్తూట్ టవర్స్,
అలకనంద, న్యూఢిల్లీ, ఢిల్లీ - 110019
Mob. 9140740067, 7529958001.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+