దేశంతో పాటు ఏటా రాష్ట్రాల బడ్జెట్ కూడా పెరుగుతూ వస్తోంది. వందల కోట్ల నుంచి మెల్లగా వేలు, లక్షల వరకూ వెళ్లింది. రాష్ట్రాల సంగతి సరే కానీ.. ఓ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సైతం అర లక్ష దాటడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల బడ్జెట్ 50 వేల కోట్లు కూడా లేకపోగా.. ఈ కార్పొపేషన్ పద్దు మాత్రం అంతకు మించి ఉండటం విశేషం.

ఘన చరిత్ర.. ధనిక సంస్థ:
భారత ఆర్థిక రాజధాని ముంబైలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC).. దాని 134 ఏళ్ల చరిత్రలో మొదటిసారి 50 వేల కోట్లకు పైగా బడ్జెట్ ప్రతిపాదించింది. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరగనుండగా.. 2023-24కి గాను కార్పొరేషన్ కమిషనర్ IS చాహల్ శనివారం అంచనాలు విడుదల చేశారు. గతేడాది దాదాపు 46 వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించగా.. ఈసారి సుమారు 53 వేల కోట్లు ఖర్చుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంటే గతేడాదితో పోలిస్తే 14.52 శాతం పెరిగిందన్నమాట.

ఎలక్టెడ్ బాడీ లేకపోవడంతో..
ప్రస్తుతం BMCలో ఎన్నిక కాబడిన స్థానిక యంత్రాంగం లేనందున.. గత 38 ఏళ్లలో తొలిసారి ఓ ప్రభుత్వాధికారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందువల్ల మేయర్, జనరల్ బాడీ ఎవరూ లేకుండానే ఈ సమావేశం ముగిసింది. పర్యావరణంలో 'నెట్ జీరో' ఉద్గారాలు, వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, పట్టణ పచ్చదనంపై ముఖ్యంగా దృష్టి పెట్టనున్నట్లు కమిషనర్ ప్రకటించారు.

దీర్ఘకాలిక వరదలకు ఫుల్ స్టాప్:
ముంబైలోని మొత్తం 386 దీర్ఘకాలిక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 306కి పరిష్కారం చూపించారు. వర్షాకాలం మొదలయ్యే లోపు 34 ప్రాంతాల్లో వరద నివారణ చర్యలు చేపట్టాలని ఈ బడ్జెట్ లో నిర్ణయించారు. లక్ష మొక్కలు నాటాలని BMC యోచిస్తున్నట్లు చాహల్ చెప్పారు. వంతెనలు, ఫుట్ పాత్ లు, డివైడర్ల సుందరీకరణ కార్యక్రమాలకోసం 1,700 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.

రద్దీ ప్రాంతాల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు:
నగరంలోని అగ్నిమాపక దళాల సామర్థ్యం పెంచేందుకు 227 కోట్లు ఖర్చు చేసేందుకు కమిషనర్ ప్రతిపాదించారు. నీటి సరఫరా కోసం 1,376 కోట్లు, మురుగునీటి పారుదల సౌకర్యానికి 3,566 కేటాయించినట్లు చెప్పారు. దహిసర్ టోల్ పోస్ట్, మాన్‌ఖుర్డ్, ములుండ్ టోల్ పోస్ట్, హాజీ అలీ జంక్షన్, కాలానగర్ జంక్షన్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో.. వాయు కాలుష్యం తగ్గించేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నగర వాసుల జీవితాన్ని సుఖవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications