కరోనా నేపథ్యంలో వివిధ రంగాల్లో భారీగా పడిపోయిన డిమాండ్‌కు ఊతమిచ్చేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్టాంప్ డ్యూటీని కట్ చేసింది. రియాల్టీ రంగ సంస్థలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. దీంతో ముంబై నగరంలో రియాల్టీ సేల్స్ పెరిగాయి. హైదరాబాద్ నగరంలోను రియాల్టీ జోష్ క్రమంగా కనిపిస్తోంది. మార్కెట్ ప్రస్తుతం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోందని చెబుతున్నారు. అన్-లాక్ ప్రారంభమైనప్పటి నుండి పుంజుకుంటోంది.

పండుగ సీజన్, డిస్కౌంట్.. పెరిగిన హౌసింగ్ సేల్స్
ప్రధానంగా ముంబై నగరంలో డిస్కౌంట్లు, స్టాంప్ డ్యూటీ ఊరట కారణంగా అక్టోబర్ నెలలో సేల్స్ పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 5,811 సేల్స్ ఉండగా, ఈ అక్టోబర్ నెలలో 8,000కు చేరుకున్నాయి. 2013 ఏప్రిల్ నుండి ఇది (అక్టోబర్) నాలుగో అతిపెద్ద మంత్లీ రిజిస్ట్రేషన్. వ్యాల్యూమ్ పరంగా, వ్యాల్యూపరంగా కూడా నాలుగో అతిపెద్దది అని ప్రోప్‌స్టాక్ స్టడీలో వెల్లడైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో (లాక్ డౌన్ ముందు నెల) 5,927 యూనిట్లుగా ఉంది. మార్చిలో 3,798 యూనిట్లకు పడిపోగా, ఏప్రిల్‍లో జీరో ఉన్నాయి. మే నెలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరుచుకోవడంతో ఆ నెలలో 207 రిజిస్ట్రేషన్లు, జూన్ నెలలో 1839 రిజిస్ట్రేషన్లు, జూలైలో 2662 రిజిస్ట్రేషన్లు, ఆగస్ట్‌లోను దాదాపు ఇదే సంఖ్య నమోదయింది. సెప్టెంబర్‌లో 5,597 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అక్టోబర్‌లో 7,929 యూనిట్లను తాకింది. పండుగ సీజన్, డిస్కౌంట్లు వంటి కారణాలతో సేల్స్ పెరిగాయి.

అందుకే సేల్స్ పెరిగాయి
గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ అక్టోబర్ నెలలో సేల్స్ 30 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ 5 శాతం నుండి 15 శాతం డిస్కౌంట్ ఇచ్చాయి. అలాగే ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించింది. వడ్డీ రేట్లు తగ్గాయి. దీనికి తోడు పండుగ సీజన్ కలిసి వచ్చింది.

హైదరాబాద్‌లోనూ...
లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రియల్టీ మార్కెట్ కుప్పకూలింది. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కాస్త ఆశాజనకంగా కనిపించింది. జనవరి-జూన్ కాలంలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ మార్కెట్ వాటానే 30 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్ లీజు లావాదేవీల్లో 18 శాతం భాగ్యనగరం చుట్టుపక్కల జరిగాయి. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ కేంద్రంగా ఎదిగింది. ఏరోస్పేస్, బయోటెక్నాలజీ వంటి కంపెనీలకు కేంద్రంగా ఎదుగుతోంది. ఇదంతా నగర రియాల్టీకి కలిసి వస్తోంది. గత ఏడాది వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌లో నివాస గృహాల ధరలు తక్కువ. ఈ ఏడాది కోల్‌కతా ఆ స్థానంలోకి వచ్చింది. భూముల ధర, నిర్మాణ ఖర్చు పెరగడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications