Threat call to Ratan Tata: మెున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని చంపేస్తామంటూ వరుస బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే తరహా బెదిరింపులు టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు వచ్చాయి.
టాటాకు బెదిరింపు కాల్ రావటంపై ముంబై పోలీసులు స్పందిస్తూ వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే పారిశ్రామికవేత్త రతన్ టాటాకు భద్రతా చర్యలను పెంచారు. సెప్టెంబర్ 4, 2022న జరిగిన కారు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించినట్లే రతన్ టాటాకి జరుగుతుందంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు వెల్లడైంది.

దీనిని చాలా సీరియస్ గా తీసుకున్న ముంబై పోలీసులు అగంతకుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి స్కిజోఫ్రెనియా అనే వ్యాధితో బాధపడుతున్న పూణేకు చెందిన ఎంబీఏ హోల్డర్‌గా గుర్తించారు. అయితే ఈ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించారు. టెక్నికల్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల సాయంతో పోలీసులు లొకేషన్‌ను గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తి పూణే నివాసానికి వెళ్లగా.. సదరు వ్యక్తి గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు.

దీనిపై అతని భార్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రారంభ ముప్పు ఉన్నప్పటికీ, కాల్ చేసిన వ్యక్తి మానసిక ఆరోగ్య పరిస్థితి కారణంగా సానుభూతితో పోలీసులు చట్టపరమైన చర్య తీసుకోకుండా వదిలేశారు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి రతన్ టాటా గురించి సదరు ఇంజనీర్ వెల్లడించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications