Sajjan Jindal: దేశంలోని స్టీల్ వ్యాపారంలో జిందాల్ గ్రూప్ గుర్తింపు కలిగిన పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. అయితే తాజాగా కంపెనీ అధినేతపై కేసు నమోదు కావటం సంచలనంగా మారింది.
తాజాగా ముంబై పోలీసులు JSW గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డిసెంబర్ 13న ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్(BKC) ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌లో 30 ఏళ్ల మహిళ ఆరోపించిన తర్వాత అతనిపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. దీంతో వ్యాపారవేత్తపై అత్యాచార కేసు నమోదైంది. ముంబై పోలీసులు సజ్జన్ జిందాల్‌పై ఐపీసీలోని 376, 354, 503 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఈ సంఘటన 2022 జనవరిలో జిందాల్ ముంబై కార్యాలయంలో జరిగింది. జిందాల్ ఆమెను ముంబైలోని BKC ప్రాంతంలోని తన కార్యాలయానికి మళ్లీ రమ్మని కోరినట్లు ఇందులో నమోదు చేయబడింది. రాత్రి 7 గంటల సమయంలో తాను అక్కడికి వెళ్లానని, భవనంలోని పెంట్‌హౌస్‌లో తనపై సదరు వ్యాపారి అత్యాచారం చేసినట్లు నటి ఫిర్యాదులో పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినట్లు సదర మహిళ పేర్కొంది. పోలీసులను ఆశ్రయించటంతో జిందాల్ వ్యక్తులు తనను బెదిరించటం ప్రారంభించారని ఆమె పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను BKC పోలీసులు పట్టించుకోలేదని అందుకే బొంబాయి హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. దీనిపై స్పందించిన కోర్టు వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించటంతో పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోదరుడితో కలిసి 2021 అక్టోబర్ 8న ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నప్పుడు దుబాయ్‌లోని స్టేడియంలోని వీఐపీ బాక్స్‌లో మొదటిసారిగా జిందాల్‌ను కలినట్లు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దుబాయ్‌లో ప్రాపర్టీ కన్సల్టెంట్‌గా ఉన్న ఆమె సోదరుడి నుంచి జిందాల్ ఆస్తిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో ఇద్దరూ నంబర్‌లను మార్చుకున్నారు.


Click it and Unblock the Notifications