Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేశ్ అంబానీని బెదిరింపు ఈ-మెయిల్స్ సంఖ్య పెరుగుతోంది. గడచిన ఏడు రోజుల్లో అంబానీకి 4 సార్లు బెదిరింపులు వచ్చాయి. వీటిలో దుండగులు డిమాండ్ చేసిన మెుత్తాన్ని ఇవ్వకపోతే చంపేస్తామంటూ వ్యాపారిని బెదిరించే ప్రయత్నం చేశారు.
అక్టోబర్ 26న మొదటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఇందులో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. తర్వాత దానిని రూ.200 కోట్లకు పెంచారు. డబ్బులు ఇవ్వకపోతే ముఖేష్ అంబానీని కాల్చివేస్తానని కూడా చెప్పాడు. ఆ తర్వాత మూడవ ఈ-మెయిల్‌లో 400 కోట్లు డిమాండ్ చేశాడు. ఎంత ఎక్కువ భద్రత ఉన్నప్పటికీ తాము ఖచ్చితంగా చంపేస్తామంటూ వీటిలో అగంతకులు బెదిరించారు.

ముంబై పోలీసులు ఇంటర్‌పోల్ ద్వారా బెదిరింపు మెయిల్స్ వివరాలను ధృవీకరించడానికి బెల్జియన్ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ కంపెనీ(VPN) సహాయాన్ని కోరింది. అంబానీకి మెయిల్స్ [email protected] నుంచి పంపబడ్డాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ IP చిరునామా బెల్జియంకు చెందినది. అయితే బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి వేరే దేశంలో ఉన్నాడని, బెల్జియం నెట్‌వర్క్‌లను ఉపయోగించి పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వ్యవహారంలో అంబానీకి బెదిరింపు ఈమెయిల్‌లు పంపినందుకు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నిందితుడిని గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించిన పోలీసులు అతడిని నవంబర్ 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తరలించారు. దర్యాప్తు సమయంలో బెదిరింపులపై మాట్లాడిన ఒక ముంబై సీనియర్ అధికారి వీటిని టీనేజర్లు చేసి ఉంటారని చెప్పారు. ప్రస్తుత అరెస్ట్ చూస్తుంటే ఆయన అంచనాలు నిజమైనట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications