ముంబైలో మూడు నెలల్లో రూ. 10 కోట్లకు పైగా గృహాల అమ్మకాలు..నైట్ ఫ్రాంక్ నివేదిక

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది . గత కొంత కాలంగా ఒడిదుడుకుల ఊగిసలాటగా సాగుతున్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే కాస్త కోలుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ముంబైలో కరోనా దెబ్బకు కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం ఈ మూడు నెలల కాలంగా కొద్దిగా కోలుకున్నట్టు కనిపిస్తుంది . సెప్టెంబర్ 1 మరియు డిసెంబర్ 17 మధ్యకాలంలో రూ. 10 కోట్లకు పైగా గృహాల అమ్మకాలు పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో అంచనా వేశారు.

 మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించటంతో పెరిగిన అమ్మకాలు

మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించటంతో పెరిగిన అమ్మకాలు

మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని 300 బిపిఎస్ (బేసిస్ పాయింట్లు) తగ్గించిన తరువాత ముంబై 116 యూనిట్ల హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలను నమోదు చేసిందని నివేదికలో పేర్కొన్నారు . అక్టోబర్ 2020 నెలలో అత్యధిక రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలు 50 యూనిట్లు అమ్ముడయ్యాయని నైట్ ఫ్రాంక్ ఒక ప్రకటనలో తెలిపారు. 2020 క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు, 240 హై-ఎండ్ రెసిడెన్షియల్ ఆస్తులు ముంబైలో అమ్ముడయ్యాయి .ఇక గృహాల అమ్మకాలు దాదాపు సగం గత నాలుగు నెలల్లో జరిగాయని పేర్కొంది.

మొత్తం 10 కోట్ల రూపాయలకు పైగా గృహాల విక్రయాలు.. సాధారణ స్థితికి చేరుతున్న అమ్మకాలు

మొత్తం 10 కోట్ల రూపాయలకు పైగా గృహాల విక్రయాలు.. సాధారణ స్థితికి చేరుతున్న అమ్మకాలు

ఇది ముంబైలో స్టాంప్ డ్యూటీ రిబేటు యొక్క సానుకూల ప్రభావాన్ని సూచిస్తుంది. లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుంటుంది, నైట్ ఫ్రాంక్ వెల్లడించింది .సెంట్రల్ ముంబై , నగరంలోని పశ్చిమ శివారు ప్రాంతాలలో ఎక్కువ అమ్మకాలు జరిగాయని .,పశ్చిమ శివారు ప్రాంతాలు 44 యూనిట్ల గృహాలతో 10 కోట్లకు పైగా ఖర్చుతో మొత్తం అమ్మకాల జాబితాలో ముందున్నాయని పేర్కొంది . సెంట్రల్ శివారు ప్రాంతాలు 43 యూనిట్ల అమ్మకాలను చూశాయని,18 హై-ఎండ్ గృహాలు దక్షిణ ముంబైలో అమ్ముడయ్యాయి "అని నైట్ ఫ్రాంక్ తెలిపారు.

మహా సర్కార్ స్టాంప్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం డిమాండ్ కు ఊపునిచ్చిందన్న నైట్ ఫ్రాంక్

మహా సర్కార్ స్టాంప్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం డిమాండ్ కు ఊపునిచ్చిందన్న నైట్ ఫ్రాంక్

ఇటీవలి ధరల దిద్దుబాటు, మహారాష్ట్రలో స్టాంప్ డ్యూటీని తగ్గించడంతో పాటు, ముంబైలోని రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా మారిందని నైట్ ఫ్రాంక్ అభిప్రాయపడింది .ఇది రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ ను ఉత్తేజపరిచింది. హై-ఎండ్ రెసిడెన్షియల్ మార్కెట్ కూడా ఫలితంగా గణనీయమైన దూకుడును చూసింది . ఈ అనుకూలమైన కారకాలలో 10 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన గృహాల అమ్మకాలు పెరిగాయి అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ షిషీర్ బైజల్ ఒక ప్రకటనలో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+