GST Notice: కేంద్ర ప్రభుత్వం గేమింగ్ కంపెనీలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పన్ను రేటును భారీగా పెంచగా.. ఆ తర్వాత జీఎస్టీ చెల్లించాలంటూ భారీ నోటీసులు పంపింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్(DGGI) ముంబై విభాగం రెండు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు భారీగా పన్ను నోటీసులు పంపింది. డ్రీమ్ 11 కంపెనీకి రూ.28,000 కోట్లకు షోకాజ్ నోటీసు జారీ చేయగా.. మరో గేమింగ్ కంపెనీ ప్లేగేమ్ 24/7కి రూ.20,000 కోట్లకు షోకాజ్ నోటీసును పంపించింది. డ్రీమ్11 ఇప్పటికే మహారాష్ట్ర స్టేట్ జీఎస్టీ నోటీసుకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

ప్రస్తుతం అన్ని ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, హార్స్ రేసింగ్ కంపెనీలు ప్రస్తుతం DGGI రాడార్‌లో ఉన్నాయి. కొన్ని రోజుల కిందట దేశంలోని ఏకైక లిస్టెడ్ గేమింగ్ కంపెనీ డెల్టా కార్ప్ రూ.16,800 కోట్లకు పన్ను నోటీసులను అందుకుంది. డెల్టా కార్ప్‌తో పాటు దాని అనుబంధ సంస్థలకు GST విభాగం నోటీసు పంపించింది. ఇందులో డెల్టా కార్ప్‌పై రూ.11,139 కోట్లు, అసోసియేట్ కంపెనీలపై రూ.5,683 కోట్ల పన్ను బకాయి ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్ ఇంటెలిజెన్స్ డీజీ ఈ నోటీసులు జారీ చేశారు.
వచ్చిన భారీ నోటీసుల వల్ల ఆ కంపెనీలు పూర్తిగా ధ్వంసమవుతాయని ఎనోచ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ MD, CEO విజయ్ చోప్రా జీ ఒక వార్తా సంస్థతో వెల్లడించారు. దీనికోసం ఒక ప్రణాళిక రూపొందించాలని అన్నారు. లేకపోతే గేమింగ్ పరిశ్రమలోని చాలా కంపెనీలు వ్యాపారాలను క్లోజ్ చేస్తాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications