Sundar Pichaiకి ముంబై కోర్టు నోటీసులు.. ఎందుకంటే..?

Court on Sundar Pichai: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీకి భారత సంతికి చెందిన వ్యక్తి సుందర్ పిచాయ్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పేరు భారతీయ వార్తల్లో ప్రధానంగా వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే తాజాగా ముంబై కోర్టు సుందర్ పిచాయ్ కి నోటీసులు పంపించింది. కంపెనీ యాజమాన్యంలో వీడియా ఫ్లాట్ ఫారమ్ యూట్యూబ్ నుంచి పరువు నష్టం కలిగించే ఒక వీడియోను తొలగించటంలో కంపెనీ విఫలమైనందుకు కోర్టు ధిక్కారం కింద పిచాయ్ కి నోటీసులు జారీ చేయబడ్డాయని వెల్లడైంది. ధ్యాన్ ఫౌండేషన్, దాని వ్యవస్థాపకుడు యోగి అశ్వినిని ఉద్దేశించి చేసిన పరువు నష్టం కలిగించే వీడియోను తొలగించాలని గతంలో మార్చి 2023న కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే దానిని ఆచరించటంలో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫాం విఫలమైందని బల్లార్డ్ పీర్‌లోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నవంబర్ 21న జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.

Mumbai Court Issues notices to Sundar Pichai over defamatory case relating to YouTube Video

యూట్యూబ్‌లోని "పఖండి బాబా కి కర్తుట్" అనే శీర్షికతో ఉన్న వీడియోను తీసివేయాలని ఆదేశించిన మార్చి 2022 కోర్టు ఉత్తర్వులను యూట్యూబ్ పదేపదే పాటించకపోవడంపై బల్లార్డ్ పీర్‌లోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ తాజాగా కంపెనీ సీఈవోకు ధిక్కార నోటీసును జారీ చేసిందని వెల్లడైంది. దీనికి ముందు ధ్యాన్ ఫౌండేషన్ 2022 అక్టోబర్‌లో యూట్యూబ్‌లో ధిక్కార పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది. గూగుల్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను విస్మరిస్తోందని ఆరోపించింది. కావాలనే వీడియో తొలగింపు ప్రక్రియను యూట్యూబ్ ఆలస్యం చేస్తోందని, దాని వల్ల ధ్యాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడి ప్రతిష్ట దిగజార్చిందని తన పిటిషన్ లో పేర్కొంది. వీడియోను తొలగించేందుకు ప్రక్రియ భారత్ వెలుపల ఉందని పేర్కొంది. దీనిపై యూట్యూబ్ స్పందిస్తూ.. ఐటీ చట్టంలోని సెక్షన్ 69-ఏ కింద పరువునష్టం ఆరోపణ జాబితా చేయబడిన కంటెంట్ కేటగిరీల పరిధిలోకి ఇది రాదని పేర్కొంది. అయితే ఈ వాదనను కోర్టు తిరస్కరించటంతో తాజా చర్యలు వచ్చాయి.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+