మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి. ఈ కేటగిరీలోని పథకాలు 3-4 సంవత్సరాల కాలంలో అధిక రాబడికి అవకాశం కల్పిస్తాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) వెబ్‌సైట్‌లోని డేటా 5 సంవత్సరాలలో 5 మల్టీ-క్యాప్ పథకాలు 13% నుంచి 21% వార్షిక రాబడిని అందించాయి. ఈ స్కీమ్‌లలో దేనిలోనైనా రూ. 5,000 SIP 5 సంవత్సరాలలో కనీసం రూ. 4.24 లక్షలకు పెరిగి ఉండేవి.
క్వాంట్ యాక్టివ్ ఫండ్ : క్వాంట్ యాక్టివ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 21.1% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 5 సంవత్సరాలలో 19.77% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ 500, మల్టీక్యాప్ 50:25:25 నిష్పత్తిలో పెట్టుబడి పెడుతోంది.

మహీంద్రా మాన్యులైఫ్ మల్టీ క్యాప్ ఫండ్ : మహీంద్రా మ్యానులైఫ్ మల్టీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 16.84% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 5 సంవత్సరాలలో 14.76% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ 500 మల్టీక్యాప్ 50:25:25 ఇన్వేస్ట్ మెంట్ చేస్తోంది.
నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ : నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 14.82% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 5 సంవత్సరాలలో 14.04% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ 500 మల్టీక్యాప్ 50:25:25 నిష్పత్తిలో పెట్టుబడి పెడుతోంది.
బరోడా BNP పారిబాస్ మల్టీ క్యాప్ ఫండ్ : బరోడా BNP పరిబాస్ మల్టీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 12.27% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 5 సంవత్సరాలలో 19.77% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ 500 మల్టీక్యాప్ 50:25:25 నిష్పత్తిలో పెట్టుబడి పెడుతోంది.
ICICI ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ : ICICI ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 13.35% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 5 సంవత్సరాలలో 12.30% రాబడిని ఇచ్చింది.


Click it and Unblock the Notifications