స్టాక్ మార్కెట్ గత కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్థిరతలను చూసింది. కానీ నిన్న గురువారం మాత్రం షేర్ మార్కెట్ పరుగులు పెడుతూ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కలిగిన నష్టాలను తిరిగి పొందింది. దింతో సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా ఎగిసింది. అయితే కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రం అదరగొడుతూ ఇన్వెస్టర్లను ఖుషి చేస్తున్నాయి. వాటిలో ఒకటి ఉజాస్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు. ఉజాస్ ఎనర్జీ లిమిటెడ్ అనే చిన్న కంపెనీ షేర్లు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుంది. కారణం గత 1 సంవత్సరంలో ఈ షేరు ధర 1,964 శాతం పెరిగింది. ఇక గడిచిన 5 సంవత్సరాలలో చేస్తే 14,600 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో ఇప్పటివరకు సుమారు 15% పెరిగింది. కానీ మార్చి ప్రారంభంలో 18 శాతానికి పైగా పడిపోయి, జనవరిలో 18.5 శాతం తగ్గి కూడా ఫిబ్రవరిలో 7 శాతానికి పైగా పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ 18న షేర్ ధర రూ.22.79కి చేరింది, ఇది 52 వారాలలో కనిష్ట స్థాయి. కానీ ఈ గురువారం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.450.70కి చేరుకుంది. ఈ విధంగా ఈ షేర్ ధర ఒక సంవత్సరంలో 1,964 శాతం పెరిగింది.

బోర్డు డైరెక్టర్ల సమావేశం: కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2025 ఏప్రిల్ 19న సమావేశం కానుందని, ఆ సమయంలో బోనస్ షేర్ల జారీని పరిశీలిస్తామని కంపెనీ తెలియజేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ ప్రతి 4 షేర్లకు 1 బోనస్ షేరును ఇచ్చింది. ఉజాస్ ఎనర్జీ 1999 సంవత్సరంలో ప్రారంభించగా, ఇది భారతదేశంలోని మొట్టమొదటి తొలి సోలార్ పవర్ కంపెనీ. ఈ కంపెనీకి సోలార్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ నిర్మాణం (EPC)లో బలమైన స్థానం ఉంది. ఇంకా 'UJAAS' బ్రాండ్ పేరుతో రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ కూడా అందిస్తుంది. ఈ కంపెనీ దాదాపు 14 మెగావాట్ల కెపాసిటీ ఇంస్టాల్ చేసి, 235 మెగావాట్ల కంటే పైగా సౌర విద్యుత్ ప్లాంట్లను నిర్మించింది.
స్టాక్ మార్కెట్ స్థితి: ఈ వారంలోని బుధవారం బిఎస్‌ఇలో ఉజాస్ ఎనర్జీ షేర్లు రూ.429.25 వద్ద ముగిసి, గురువారం రూ.435 వద్ద ప్రారంభమయ్యాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే కారణంగా స్టాక్ మార్కెట్ మూసివేయబడింది. మరోవైపు గురువారం మార్కెట్ క్షీణతతో ప్రారంభమవగా, కానీ విదేశీ పెట్టుబడిదారుల భారీ పెట్టుబడుల కారణంగా ఊపందుకుంది. ఈ వారం నాలుగు రోజులూ మార్కెట్ బుల్లిష్‌గా ఉంది, దింతో సెన్సెక్స్ మొత్తం 4700 పాయింట్లకు పైగా లాభపడింది. అంటే ఇప్పుడు రికార్డు గరిష్ట స్థాయి కంటే కేవలం 9 శాతం మాత్రమే తక్కువ.


Click it and Unblock the Notifications