గత వారం స్టాక్ మార్కెట్ ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. ఒక మాటలో చెప్పాలంటే భారీ నష్టాలకు గురైంది. దింతో షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ల భారీ సంపద కూడా బూడిదలో పోసిన పన్నీరులాగ ఆవిరైపోయింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కోలుకుంటూ నిలకడ దిశగా పయనిస్తుంది. గత రెండు రోజులుగా భరత్ స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్కులో ట్రేడైంది. ఇదిలా ఉంటే స్టాక్ మార్కెట్ దిగజారిపోతున్న కూడా కొన్ని పెన్నీ స్టాక్స్ అదరగొడుతున్నాయి. ఇంకా అప్పర్ సర్క్యూట్ తాకుతూ ఇన్వెస్టర్లకు లాభాలను పండించాయి. వాటిలో ఒకటి హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్.
హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ అనే చిన్న కంపెనీ షేర్లలో భారీ తాజాగా పెరుగుదల కనిపించింది. నిన్న గురువారం హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు 13 శాతం పెరిగి రూ.37.83 వద్ద ముగిశాయి. గత ఐదు సంవత్సరాలలో కంపెనీ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు 5 సంవత్సరాలలో 25,000 శాతానికి పైగా పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేరు ధర 15 పైసల నుండి రూ.37కి పైగా పెరిగింది. హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ కూడా దాని షేర్స్ విభజించుకుంది.

25000% కంటే పైగా హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు :
30 మార్చి 2020న హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేరు 15 పైసలు ఉండగా 6 మార్చి 2025న కంపెనీ షేరు ధర రూ.37.83 వద్ద ముగిశాయి. గత 5 సంవత్సరాలలో ఈ మల్టీబ్యాగర్ కంపెనీ షేర్స్ 25,120 శాతం పెరిగాయి. అదే సమయంలో గత 4 సంవత్సరాలలో కంపెనీ షేర్లు 11000 శాతానికి పైగా పెరిగాయి. గత 3 సంవత్సరాలలో చూస్తే హజుర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు 1333 శాతం పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు రూ.2.64 నుండి రూ.37 కి పైగా పెరిగింది. అయితే కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ట స్థాయి రూ.63.90. కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.28.41. హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్ల విభజన (స్టాక్ స్ప్లిట్) చేసింది. కంపెనీ షేర్లను 10 ముక్కలుగా విభజించింది. గత ఏడాది నవంబర్‌లో, హుజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ రూ.10 ఫేస్ వాల్యూగల షేర్లను 10 షేర్లుగా రూ.1 ఫేస్ వాల్యూగా విభజించింది.
ఒక నెలలోనే 26% కంటే పైగా పడిపోయిన షేర్లు:
గత ఒక నెలలో హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు 26% కంటే పైగా పడిపోయాయి. 6 ఫిబ్రవరి 2025న ఈ స్మాల్‌క్యాప్ కంపెనీ షేర్లు రూ.51.68గా ఉన్నాయి. అయితే 6 మార్చి 2023న కంపెనీ షేర్లు రూ.37.83 వద్ద ముగియగా, ఈ ఏడాది ఇప్పటివరకు హజుర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు 29 శాతానికి పైగా పడిపోయాయి. గత 2 నెలల్లో చుస్తే కంపెనీ షేర్లు 33 శాతం డౌన్ అయ్యాయి.


Click it and Unblock the Notifications