Multibagger Stock: రూ.లక్ష పెట్టుబడిని రూ.కోటి చేసిన టాటా స్టాక్.. మీ దగ్గర ఉందా..?
Multibagger Stock: ఇటీవలి కాలంలో మార్కెట్లు చాలా ఒడిదొడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక, బ్యాంకింగ్ పరిస్థితుల కారణంగా కుప్పకూలటం, స్తబ్ధుగా చాలా కాలం కొనసాగాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు కొంత గాడిన పడటంతో మల్టీబ్యాగర్ షేర్లు తిరిగి తమ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించటం తిరిగి ప్రారంభించాయి.
టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పెట్టుబడిదారులకు బలమైన రాబడులను అందించింది. ఇటీవల నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన కంపెనీ ఇన్వెస్టర్లకు మంచి డివిడెండ్ ప్రకటించింది. గడచిన కొన్ని సంవత్సరాలుగా టీసీఎస్ షేరు ధర రూ.118 నుంచి రూ.3,100కి చేరుకుంది. ఈ క్రమంలో 2500 శాతం అంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ క్రమంలో రెండు సార్లు బోనస్ షేర్లను ఇచ్చింది.

మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీల్లో దీర్ఘకాలం వాటాలను హోల్డ్ చేయటం ద్వారా ఇన్వెస్టర్లు మంచి రాబడులను పొందవచ్చని టీసీఎస్ రుజువు చేసింది. 20 ఫిబ్రవరి 2009న బీఎస్ఈలో TCS షేర్ ధర రూ.118.49గా ఉంది. అప్పుడు లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే 843 షేర్లు వచ్చేవి. ఆ తర్వార 2009, 2018లో 1:1 రేషియోలో కంపెనీ బోనస్ షేర్లు అందించింది. అలా షేర్ల సంఖ్య 3372కి చేరుకుంది. ఈ షేర్ల ప్రస్తుత మార్కెట్ ధర రూ.1.07 కోట్లకు చేరుకుంది.
గత 10 సంవత్సరాల్లో TCS స్టాక్ బలమైన రాబడిని అందించింది. అప్పట్లో షేరు ధర రూ.684.10 వద్ద ఉన్నప్పుడు లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు వాటి మార్కెట్ విలువ రూ.9.33 లక్షలకు చేరుకుంది. అలాగే గడచిన 5 ఏళ్ల కాలంలో టీసీఎస్ షేర్లు 1.32 శాతం క్షీణించాయి. చివరి ఆరు నెలల కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ ధర రెండు శాతానికి పైగా లాభపడింది.

ఇటీవలి కాలంలో కంపెనీ సీఈవోగా ఉన్న రాజేష్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జూన్ 1, 2023 నుంచి కీర్తివాసన్ ను కంపెనీ యాజమాన్యం నియమించింది. ఇటీవల ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 14.8 శాతం పెరిగి రూ.11,392 కోట్లుగా నమోదైంది.


Click it and Unblock the Notifications