దేశీయ స్టాక్ మార్కెట్ నేడు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమవగా, సుజ్లాన్ ఎనర్జీ షేర్లు దాదాపు 15% పెరిగాయి. BSEలో ఈ స్టాక్ రూ.74.30 గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే నిన్న గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ నాల్గవ త్రైమాసిక ఫలితాలను (Q4 results) విడుదల చేసింది. ఈ కాలంలో కంపెనీ లాభం 365% పెరిగి రూ.1,182 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.254 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం కూడా పెరిగింది. ఆదాయం పరంగా చూస్తే 73% పెరిగి రూ.3,773 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఆదాయం రూ.2,179 కోట్లుగా ఉంది.

గత త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ లాభం 205% పెరిగింది. అంటే రూ.387 కోట్ల నుంచి రూ.1,182 కోట్లకు పెరిగింది. అదే సమయంలో ఆదాయం 27% పెరిగి రూ.2,969 కోట్ల నుంచి రూ.3,773 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆర్థిక సంవత్సరం గురించి మాట్లాడుకుంటే 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ. 2,072 కోట్లుగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో లాభం రూ. 660 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం 67% పెరిగి రూ.10,851 కోట్లకు చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో దీని లాభం రూ.6,497 కోట్లు. కంపెనీ ఖర్చులు కూడా పెరిగాయి. ఖర్చులు చూస్తే రూ.3,274 కోట్లుగా ఉంది. గత త్రైమాసికంలో ఖర్చులు రూ.2,611 కోట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఖర్చులు రూ.1,927 కోట్లుగా ఉంది.
సుజ్లాన్ ఎనర్జీ షేర్ ధర ఎంత : ట్రెండ్‌లైన్ ప్రకారం, సుజ్లాన్ ఎనర్జీ యావరేజ్ టార్గెట్ ధర రూ.70. అయితే ఎనిమిది మంది విశ్లేషకులు ఈ షేరును ట్రాక్ చేస్తున్నారు. అలాగే షేర్స్ కొనమని కూడా సిఫార్సు చేస్తున్నారు. గత మూడు నెలల్లో ఈ స్టాక్ 31% లాభపడింది. అదేవిధంగా గత రెండు సంవత్సరాలలో షేర్ 532% పెరిగింది. సుజ్లాన్ మార్కెట్ క్యాప్ రూ. 89,291 కోట్లు. దీని 52 వారాల గరిష్ట స్థాయి రూ. 86.04 కాగా, కనిష్ట స్థాయి రూ. 44.21.
సుజ్లాన్ కంపెనీ వివిధ తయారీల నుండి డబ్బు సంపాదిస్తుంది. ఇందులో విండ్ టర్బైన్ జనరేటర్లు, ఫౌండ్రీలు అండ్ ఫోర్జింగ్‌లు అలాగే ఆపరేషన్ ఇంకా మెయింటెనెన్స్ సేవలు ఉన్నాయి. ఇది కాకుండా కంపెనీకి ఇతర మార్గాల నుండి కూడా రూ.4 కోట్ల ఆదాయం వచ్చింది.
స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది : సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ మల్టీబ్యాగర్ స్టాక్ అని నిరూపించింది. గత 5 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడి ఇచ్చింది. అంటే 5 సంవత్సరాల క్రితం షేర్ ధర రూ. 2.57. కానీ గురువారం షేర్ ధర 1.37% తగ్గి రూ.65.42 వద్ద ముగిసింది. కానీ 5 సంవత్సరాల రాబడి దాదాపు 2445 శాతంగా ఉంది. మీరు 5 సంవత్సరాల క్రితం ఈ షేర్లను రూ.1 లక్ష విలువైన కొనుగోలు చేసి ఉంటే, నేడు వాటి విలువ రూ.25 లక్షల కంటే ఎక్కువగా ఉండేది.


Click it and Unblock the Notifications