SG Finserve Stock: త్వరగా ధనవంతులు కావలనుకునే వారు ఈ కాలంలో స్టాక్ మార్కెట్లలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు పొందినంత లాభం వీరికి రాదు. అయితే కొందరు తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం మంచి ఫండమెంటల్స్ ఉండే మల్టీబ్యాగర్లను వెతికి ఇన్వెస్ట్ చేసి కోటీశ్వరులుగా మారిపోతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకుబోతున్నది పెట్టుబడిదారులను కోటీశ్వరులుగా మార్చేసిన ఎస్‌జి ఫిన్‌సర్వ్ కంపెనీ షేర్ల గురించే. ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లకు గత 4 ఏళ్లలో అద్భుతమైన మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. వాస్తవానికి మార్చి 2020న ఒక్కో షేరు ధర కేవలం రూ.2.8గా ఉంది. అయితే నేడు ఈ స్టాక్ ధర దాదాపు రూ.429 వద్ద కొనసాగుతోంది. అంటే ఈ కాలంలో కంపెనీ షేర్లు తన పెట్టుబడిదారులకు ఏకంగా 16,000 శాతానికి పైగా రాబడిని అందించింది.

ఈ లెక్కన ఎవరైనా పెట్టుబడిదారుడు మార్చి 2020లో కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారు కోటీశ్వరులయ్యేవారు. ఎందుకంటే లక్ష పెట్టుబడి విలువ ప్రస్తుతం షేర్ల మార్కెట్ విలువ ప్రకారం 1.52 కోట్లుగా ఉండేది. అయితే 2024లో ఏడాది ప్రాతిపదికన 12 శాతం క్షీణించింది.
వరుసగా 2 నెలల క్షీణత తర్వాత ఏప్రిల్ మొదటి సెషన్‌లో స్టాక్ 5 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలో 9 శాతం, ఫిబ్రవరిలో 10 శాతానికి పైగా క్షీణించింది. కాగా ఈ ఏడాది జనవరిలో షేరు 2.8 శాతం పెరిగింది. ప్రస్తుతం రూ.429 వద్ద ట్రేడవుతోంది. మే 26, 2023న ఈ స్టాక్ దాని ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ.748కి స్టాక్ ధర చేరుకుంది. అలాగే స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.384.95 వద్ద ఉంది. మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో స్టాక్ ధర ఇంట్రాడేలో రూ.428.40 స్థాయి వద్ద కొనసాగుతోంది.
SG ఫిన్సర్వ్ లిమిటెడ్ కంపెనీ బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్, ఆన్‌లైన్ ట్రేడింగ్, ఫండ్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలను అందిస్తోంది. కంపెనీని గతంలో ముంగిపా సెక్యూరిటీస్ లిమిటెడ్ అని పిలిచేవారు. SG ఫిన్‌సర్వ్ లిమిటెడ్ 1994లో స్థాపించబడింది.


Click it and Unblock the Notifications