Bonus Multibagger: ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలో చాలా మంది ఇన్వెస్టర్లు బోనస్ షేర్లు అందించే షేర్ల కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక కంపెనీ ఏకంగా 17 షేర్లు చొప్పున మెుదటిసారిగా బోనస్ షేర్లను ప్రకటించింది.
వివరాల్లోకి వెళితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఓలాటెక్ సొల్యూషన్స్ కంపెనీ గురించే. తాజాగా కంపెనీ బోర్డు తన ఇన్వెస్టర్లకు 17 బోనస్ షేర్లను జారీ చేయాలని నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా కంపెనీ అప్పర్ సర్క్యూట్‌లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం అప్పర్ సర్క్యూట్ వద్ద షేర్ ధర రూ.239.60గా నిలిచింది. అయితే ఇప్పుడు కంపెనీ అందిస్తున్న ఉచిత షేర్లను అందుకునేందుకు ఇన్వెస్టర్ల నుంచి భారీగా డిమాండ్ పెరుగుతోంది.

ఎవరైనా ఇన్వెస్టర్ బోనస్ షేర్లను పొందేందుకు అర్హులు కావాలంటే ముందుగా కంపెనీ నిర్ణయించిన రికార్డు తేదీ లోపు సదరు కంపెనీలో షేర్లను కలిగి ఉండాల్సి ఉంటుంది. కంపెనీ ప్రకటన ప్రకారం ప్రతి 20 షేర్లు కలిగి ఉన్న అర్హులైన పెట్టుబడిదారులకు కంపెనీ ఉచితంగా 17 షేర్లను అందించనుంది. దీనికోసం నవంబర్ 20, 2023ను రికార్డు తేదీగా నిర్ణయించింది. దీని ప్రకారం రేపు అంటే సోమవారం కంపెనీ షేర్లు ఎక్స్-బోనస్ స్టాక్‌గా ట్రేడ్ అవుతుంది.
వాస్తవానికి గడచిన ఆరు నెలల కాలంలో స్టాక్ తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. నవంబర్ 12 నుంచి కంపెనీ షేర్లు ఎక్కువ రోజుల పాటు అప్పర్ సర్క్యూట్‌లో ట్రేడింగ్ కొనసాగించాయి. గడచిన నెల రోజులను పరిశీలిస్తే షేర్ ధర ఏకంగా 45 శాతానికి పైగా పెరిగింది. అలాగే ఆరు నెలల కాలాన్ని పరిశీలిస్తే ఇన్వెస్టర్లకు స్టాక్ ఏకంగా 166 శాతం రాబడిని అందించి వారిని ధనవంతులుగా మార్చేసింది. ఈ క్రమంలో ఒలాటెక్ సొల్యూషన్స్ స్టాక్ 52 వారాల గరిష్ఠ రూ.239.60 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.75గా నమోదైంది.


Click it and Unblock the Notifications