Dividend Stock: సెప్టెంబర్ త్రైమాసికం ముగియటంతో స్టాక్ మార్కెట్లలో లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు వరుసగా తమ క్యూ2 ఫలితాలను ప్రకటిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు డివిడెండ్ కూడా అవి ప్రకటిస్తున్నాయి.
ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నది MPS లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ప్రస్తుతం తన పెట్టుబడిదారులకు డివిడెండ్ రూపంలో రూ.30 చెల్లించాలని నిర్ణయించింది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు 100 శాతం రాబడిని అందించాయి. అర్హులైన ఇన్వెస్టర్ల కోసం ఎక్స్-డివిడెండ్ తేదీ నవంబర్ 6గా కంపెనీ నిర్ణయించినట్లు తన స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో వెల్లడించింది.

MPS లిమిటెడ్ ఈ ఏడాది రెండోసారి డివిడెండ్ ఇవ్వబోతోంది. అంతకుముందు జూలైలో ఒక్కో షేరుపై రూ.20 డివిడెండ్ అర్హులైన ఇన్వెస్టర్లకు అందించింది. ఈ డివిడెండ్ చెల్లించే కంపెనీ 2020లో 2021 షేర్లను మార్కెట్ల నుంచి తిరిగి కొనుగోలు చేసింది. శుక్రవారం నాడు MPS లిమిటెడ్ షేరు ధర 1 శాతం కంటే ఎక్కువ లాభంతో రూ.1,536 వద్ద NSEలో ట్రేడింగ్ ముగిసింది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,829.80గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.690గా ఉంది.
గడచిన 6 నెలల్లో కంపెనీ షేర్ ధర దాదాపు 80 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో MPS లిమిటెడ్ షేర్ ధర గత ఏడాదిలో 100 శాతం పెరిగింది. అయితే గత ఏడాది కాలంలో ఈ షేరు 12 శాతానికి పైగా పడిపోయింది. ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీలో అందిస్తున్న డివిడెండ్ పొందాలంటే కంపెనీ ప్రకటించిన రికార్డు తేదీన వారి డీమ్యాట్ ఖాతాలో షేర్లను కలిగి ఉండాల్సి ఉంటుంది. కంపెనీ పుస్తకాల ప్రకారం రికార్డు తేదీన షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే తాజాగా ప్రకటించిన డివిడెండ్ పొందేందుకు అర్హులు కాబట్టి దీనికి అనుగుణంగా షేర్లను కలిగి ఉండాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications