Dividend Multibagger: ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. దీర్ఘకాలంలో కోటీశ్వరులుగా మార్చిన స్టాక్ ప్రస్తుతం సూపర్ డివిడెండ్ ఆఫర్ చేస్తోంది.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది హాకిన్స్ కుక్కర్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. డీమ్యాట్ ఖాతాలు లేనప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎక్కువ కాలం కొనసాగించేవారు. అలా ఈ కుక్కర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలం హోల్డ్ చేసిన పెట్టుబడిదారులు కోటీశ్వరులుగా మారిపోయారు. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీ షేర్ విలువ ఉదయం 10.35 గంటల సమయంలో బీఎస్ఈలో రూ.6,630 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం షేర్ తన 52 వారాల గరిష్ఠమైన రూ.6,749.90ని తాకింది

తెలివైన ఇన్వెస్టర్లు మంచి ఫండమెంటల్స్, గ్రోత్ అవకాశాలు ఉండే కంపెనీలలో తమ పెట్టుబడులను చాలా కాలం పాటు కొనసాగిస్తుంటారు. 20 ఏళ్ల కిందట హాకిన్స్ షేర్ ధర రూ.19.80 వద్ద ఉంది. అప్పట్లో లక్ష ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగించిన వారికి 33,687 శాతం రాబడిని అందించింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇన్వెస్టర్ల సంపద రూ.3.40 కోట్లకు పెరిగింది. కంపెనీ చాలా కాలంగా కిచెన్‌వేర్ తయారీ వ్యాపారంలో మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది.
తాజాగా మే 24, 2023న జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ.100 డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డివిడెండ్ ఆగస్టు 09, 2023న జరగబోయే కంపెనీ AGMలో వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుంది. డివిడెండ్ సొమ్ము సెప్టెంబర్ 08, 2023 నాటికి చెల్లించబడుతుందని తెలుస్తోంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications