మల్టీబ్యాగర్ కంపెనీ రక్షణ రంగ సంస్థ జెన్ టెక్నాలజీస్ ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలను ఇచ్చింది. గత ఐదు సంవత్సరాలలో కంపెనీ షేర్లు 5000 శాతానికి పైగా పెరిగాయి. ఈ కాలంలోనే జెన్ టెక్నాలజీస్ షేర్ ధర రూ.25 నుండి రూ.1,300 కంటే పైగా పెరిగాయి. జెన్ టెక్నాలజీస్ భారతదేశంలో యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ అండ్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్స్ యొక్క ప్రముఖ సప్లయర్. అయితే గురువారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు 3 శాతానికి పైగా పెరిగి రూ.1319.95కి చేరుకున్నాయి. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ట స్థాయి చూస్తే రూ.2627.95 అదే సమయంలో జెన్ టెక్నాలజీస్ షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.873.

రూ. 1 లక్షను రూ. 50 లక్షలకు పైగా చేసింది: జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు 27 మార్చి 2020న రూ. 25.30 వద్ద ఉండగా 20 మార్చి 2025న ఈ మల్టీబ్యాగర్ కంపెనీ షేర్లు రూ.1319.95కి చేరాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు 5060 శాతానికి పైగా పెరగడం గమనార్హం. ఒక వ్యక్తి 27 మార్చి 2020న జెన్ టెక్నాలజీస్ షేర్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని ఇప్పుడు నిలుపుకుంటే, ప్రస్తుతం రూ.1 లక్షకు కొనుగోలు చేసిన షేర్ల విలువ రూ.52.17 లక్షలు అయ్యేది.
గత నాలుగు సంవత్సరాలలో 1400% కంటే పైగా పెరిగిన కంపెనీ షేర్లు: గత నాలుగు ఏళ్లలో చుస్తే జెన్ టెక్నాలజీస్ షేర్లు 1430 శాతం పెరిగాయి. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీతో అనుబంధించిన ఈ స్మాల్‌క్యాప్ కంపెనీ షేర్లు 19 మార్చి 2021న రూ. 85.10 వద్ద ఉన్నాయి. కానీ 20 మార్చి 2025న కంపెనీ షేర్లు రూ.1319.95కి చేరుకున్నాయి. దీని బట్టి చూస్తే గత మూడు సంవత్సరాలలో జెన్ టెక్నాలజీస్ షేర్లు 550 శాతానికి పైగా లాభపడ్డాయి. యాంటీ-డ్రోన్ వ్యవస్థలను తయారు చేసే ఈ కంపెనీ షేర్లు గత రెండేళ్లలో చూస్తే 450 శాతానికి పైగా, అదే సమయంలో జెన్ టెక్నాలజీస్ షేర్లు గత ఏడాది కాలంలో 45 శాతానికి పైగా పెరిగాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో 150 డ్రోన్లను ప్రయోగించారని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అడ్వైసరి కంపెనీ ఎలారా తెలిపింది. ఇది అనేక ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ (CDS) కోసం పెరుగుతున్న డిమాండ్‌ను చూపిస్తుంది. అందువల్ల, దేశీయ CDS మార్కెట్ FY29 నాటికి 24 శాతం CAGR వద్ద రూ.15,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా.


Click it and Unblock the Notifications