గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో చాలా ఒడిదొడుకులు నెలకొన్నాయి. కానీ నేడు స్టాక్ మార్కెట్ ఉదయం నుండే లాభాల్లో మొదలైంది. షేర్ మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,400 పాయింట్లకు పైగా ఎగిసింది. ఈ పెరుగుదలతో పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.7 లక్షల కోట్లు పెరిగింది. అయితే పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ సంస్థ ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ (ఇండియా) షేర్లు వరుసగా నేడు నాలుగో రోజుల్లో 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. దింతో బిఎస్ఇలో షేర్ ధర రూ.544.20కి చేరుకుంది. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.16,335.02 కోట్లకు పెరిగింది. అంతేకాదు మార్చి త్రైమాసికంలో కంపెనీ చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచింది. ఈ కాలంలో కంపెనీ లాభం రెండింతలు పెరిగి రూ.94.20 కోట్లుగా ఉంది, గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే రూ.39.93 కోట్లుగా ఉంది.

గత ఐదు సంవత్సరాలలో ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ (ఇండియా) షేర్ 15,000% కంటే పైగా రిటర్న్ ఇచ్చింది. ఈ కాలంలో కంపెనీ షేర్ ధర రూ.3.45 నుండి రూ.544 కి పెరిగింది. ఐదు సంవత్సరాల క్రితం ఒక పెట్టుబడిదారుడు ఈ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు అతని పెట్టుబడి విలువ రూ.1.50 కోట్ల కంటే పైగా ఉండేది. ఈ షేర్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 650.23. ఈ ఏడాది జనవరి 8న ఈ స్థాయికి చేరింది. దీని 52 వారాల కనిష్ట స్థాయి చూస్తే రూ.247.75. గత ఏడాది ఏప్రిల్ 10న ఈ స్థాయికి తాకింది. అంటే కంపెనీ షేర్ ధర ఒక సంవత్సరంలో రెట్టింపు కంటే ఎక్కువైంది.
లాభం ఎంత పెరిగిందంటే : ట్రాన్స్‌ఫార్మర్స్ & రెక్టిఫైయర్స్ (ఇండియా) చాల రకాల ఉత్పత్తులను తయారు చేస్తుంది. వీటిలో 500 MVA ఇంకా 1200 kV క్లాస్ వరకు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫర్నేస్ ట్రాన్స్‌ఫార్మర్లు, రెక్టిఫైయర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఇంకా స్పెషాలిటీ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. అలాగే కంపెనీ వివిధ రంగాలలో కొనసాగుతుంది. వీటిలో విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, రైల్వేలు, రెన్యువబుల్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు సహా పారిశ్రామిక తయారీ ఉన్నాయి. ఈ కంపెనీ ఉత్పత్తులను ఆసియా, ఆఫ్రికా ఇంకా మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ.216.44 కోట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో చూస్తే రూ.47.01 కోట్లుగా ఉంది. ఈ విధంగా కంపెనీ లాభం దాదాపు నాలుగున్నర రెట్లు పెరిగింది.


Click it and Unblock the Notifications