స్టాక్ మార్కెట్ చాలా కాలంగా క్షీణతలో కొనసాగుతుంది. అలాగే ఒక దశలో చారిత్రక కనిష్ట స్థాయికి చేరి ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించేసాయి కూడా. ఈ వారంలో చూస్తే ప్రస్తుతం గ్రీన్ మార్కులో ట్రేడవుతుంది. మరోవైపు స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రం ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇస్తూ అదరగోట్టాయి. ఇక ఈ ఏడాది మొదటి నుండి చూస్తే మల్టీబ్యాగర్ స్టాక్‌ల సంఖ్య భారీగా తగ్గింది. అయితే FY24లో మాత్రం రూ. 5,000 కోట్ల కంటే పైగా మార్కెట్ క్యాప్ ఉన్న 207 స్టాక్‌లు మల్టీబ్యాగర్‌లుగా నిరూపించాయి, కానీ FY25లో ఈ సంఖ్య కేవలం 17కి చేరింది. సుమారు స్టాక్ మార్కెట్లో 700 కంటే పైగా షేర్స్ లిస్ట్ కాగా, వాటి మార్కెట్ క్యాప్ రూ.5,000 కోట్ల కంటే ఎక్కువ. కానీ ఈ సంవత్సరం మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించిన స్టాక్‌లలో PG ఎలక్ట్రోప్లాస్ట్, శక్తి పంప్స్, V2 రిటైల్, షెల్లీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, JSW హోల్డింగ్స్, సర్దా ఎనర్జీ & మినరల్స్ ఇంకా పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ స్టాక్స్ షేర్ మార్కెట్ ట్రెండ్‌ను అధిగమించి పెట్టుబడిదారులను సంతోషపెట్టాయి.

వీటిలో PG ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంది, ఈ షేర్ FY25లో అత్యధికంగా 403% రాబడిని ఇచ్చింది. అంటే ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారి డబ్బు దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. కానీ మల్టీబ్యాగర్ స్టాక్‌ల సంఖ్యలో ఈ భారీ తగ్గుదల మార్కెట్‌లో మందగమనాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లు పెట్టుబడిదారులను నిరాశపరిచాయి. ప్రస్తుతం మార్కెట్ పతనం కారణంగా పెట్టుబడిదారులు చాలా ఎక్కువగా రిటర్న్ ఆశించకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఏ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి అంటే : స్టాక్ మార్కెట్ ఇప్పుడు భారీ ర్యాలీ వైపు కాకుండా స్టాక్-నిర్దిష్ట దశ వైపు కదులుతున్నందున పెట్టుబడిదారులు వారి పెట్టుబడులపై రాబడి అంచనాలను తగ్గించుకోవాలని అరిహంత్ క్యాపిటల్ రీసర్చ్ హెడ్ అభిషేక్ జైన్ అన్నారు. దీని అర్థం ఏంటంటే ప్రస్తుతం ప్రతి షేర్ ధర పెరగదు, కానీ కొన్ని నిర్దిష్ట స్టాక్‌లు మాత్రమే బాగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. పెట్టుబడిదారులు మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీలపై క్షుణ్ణంగా పరిశోధన చేయాలని నిపుణులు అంటున్నారు. ఇంకా ట్రేడింగ్ బేసిక్స్ అర్థం చేసుకోవాలి అలాగే నష్టాల ప్రమాదాన్ని తగ్గించడానికి మీ ఇన్వెస్ట్మెంట్స్ వివిధ రంగాలుగా విభజించుకోవాలి. ఇలా చేయడం ద్వారా స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులో లేదా ప్రతికూల వాతావరణంలో నష్టాలను తగ్గించుకోవచ్చు.


Click it and Unblock the Notifications