Multibagger Stock: లక్షను రూ.80 లక్షలు చేసిన స్టాక్.. తక్కువ కాలంలోనే..
Multibagger Stock: ఒక పక్క మార్కెట్లలోకి ఐపీవోలు ప్రవేశిస్తూ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుంటే.. మరో పక్క మల్టీబ్యాగర్లు ఊహించని లాభాలను అందిస్తున్నాయి. తక్కువ కాలంలోనే పెట్టుబడిదారులు ధనవంతులుగా మారిపోతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది Waree రెన్యూవబుల్స్ స్టాక్ గురించే. సోలార్ ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. సోలార్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తున్న ఈ సంస్థ 52.6 MPW పెద్ద ఆర్డర్‌ను అందుకుంది. ఏడాది చివరి నాటికి దీనిని పూర్తి చేయాల్సి ఉంది. దీంతో కంపెనీ స్టాక్ సైతం భారీగా వృద్ధిని నమోదు చేసింది.

శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్ ధర రూ.1,276.80 వద్ద ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు స్టాక్ 154 శాతం రాబడిని అందించింది. గడచిన నెలరోజుల్లో స్టాక్ 2.73 శాతం మేర తగ్గుదల నమోదు చేసింది. అలాగే మూడేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 7900% బలమైన రాబడిని అందించింది. కంపెనీ షేర్లలో ఎవరైనా పెట్టుబడిదారుడు సెప్టెంబర్ 11, 2020లో రూ.15.40 రేటు వద్ద లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి దానిని కొనసాగించి ఉంటే.. ప్రస్తుతం దాని విలువ సుమారు రూ.80 లక్షలకు పైనే ఉండేది.
భవిష్యత్తు సోలార్ ఎనర్జీ కావటంతో ప్రస్తుతం ఈ రంగంలోని కంపెనీలు మంచి ఆదాయాలను, వ్యాపారాన్ని చూస్తున్నాయి. వారీ స్టాక్ తన ఇన్వెస్టర్లను నిరంతరం సంపన్నులు చేస్తూనే ఉంది. అలాగే గత ఐదేళ్ల కాలంలో స్టాక్ ధర 6,109.52 శాతం పెరుగుదలను నమోదు చేసింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,314.70గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.1,260.10 వద్ద ఉంది. రానున్న కాలంలో సైతం కంపెనీ మంచి రాబడులను అందించగలదని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications