Stock Crash: హైకోర్టు ఆదేశాలతో క్రాష్ అయిన స్టాక్.. మీ డబ్బులు ఇరుక్కున్నాయా..?
Multibagger Crash: దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. తాజాగా దిల్లీ కోర్టు ఆదేశాల కారణంగా ఒక కంపెనీ షేర్లలో కల్లోలం మెుదలైంది.
నేడు మల్టీబ్యాగర్ స్టాక్ లో ఇన్వెస్టర్ల తొక్కిసలాట కొనసాగుతోంది. నేడు మార్కెట్లో పైసాలో డిజిటల్ కంపెనీ షేర్లను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు పోటీపడుతున్నారు. దీంతో కంపెనీ షేర్లు భారీగా క్షీణతకు గురయ్యాయి. దీని వెనుక అసలు కారణం దీల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుగా తెలుస్తోంది. ఉదయం ఆరంభంలో రూ.176 రేటు వద్ద ప్రారంభమైన కంపెనీ షేర్లు ఇంట్రాడేలో రూ.140.20 స్థాయికి పడిపోయాయి. అంటే స్టాక్ నేడు దాదాపు 20 శాతం క్షీణించాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో 17.81 శాతం క్షీణించి రూ.144కి చేరుకుంది.

నెల ప్రారంభంలో మార్చి 1న కనిపించిన స్థాయి రూ.199.25 నుంచి ఏడాది గరిష్ట స్థాయి నుంచి 29.86 శాతం పడిపోయింది. 15 ఏళ్ల క్రితం పైసాలో షేరు ధర కేవలం రూ.4.43 మాత్రమే. ప్రారంభంలో డబ్బును పెట్టుబడి పెట్టారో వారికి ఈరోజు 3126% మల్టీబ్యాగర్ రాబడి వచ్చింది. గత ఐదేళ్లలో దాదాపు 380 శాతం, ఏడాది కాలంలో 145 శాతం రాబడిని అందించింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కంపెనీ షేర్లు దీర్ఘకాలికంగా అదనపు నిఘా చర్యలు ఫ్రేమ్‌వర్క్ క్రింద ఉంచాయి. ఈ స్టాక్ మార్చి 20న 1:1 నిష్పత్తిలో ఎక్స్-బోనస్‌గా ట్రేడ్ కానుంది.
పైసాలో అన్యాయమైన రుణాలివ్వడంపై దర్యాప్తు చేసిన పిటిషన్‌పై ఈరోజు దిల్లీ హైకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి ప్రతిస్పందనను కోరింది. కంపెనీ ఏటా 125 శాతం వడ్డీ వసూలు చేస్తుందని ఆరోపించారు. పిటిషన్‌లో అధిక వడ్డీ రేట్లను ఆరోపిస్తూ.. మే 2019లో రూ.15.9 కోట్ల బకాయి రుణం జూన్ 2019 నాటికి రూ.23 కోట్లకు పెరిగిందని పిటిషనర్ తెలిపారు. వాస్తవానికి సెబీ ఎన్‌బిఎఫ్‌సీల రుణ విధానాలను నియంత్రించదు. ప్రత్యుత్తరం సిద్ధం చేయడానికి కోర్టు పైసాలో 4 వారాల సమయం ఇచ్చింది.


Click it and Unblock the Notifications