Bonus Multibagger: కరోనా కల్లోలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోని చాలా కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. అయితే ఆ తర్వాత మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తూ దూసుకుపోతున్నాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ స్టాక్ మార్కెట్లో అద్భుతమైన రాబడిని అందించిన కంపెనీల్లో ఒకటిగా నిలిచిన JTL ఇండస్ట్రీస్ గురించే. గత 3 ఏళ్లలో కంపెనీ షేర్ ధర 2,300 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. ఈ స్మాల్ క్యాప్ స్టాక్ కరోనా మహమ్మారి తర్వాత ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడిని అందించింది. తాజాగా ఈ మల్టీబ్యాగర్ స్టాక్ పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.

జూలై 29, 2023న కంపెనీ బోర్డు మీటింగ్ జరగనుందని JTL ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్ లో వెల్లడించింది. ఈ క్రమంలో బోనస్ షేర్లపై నిర్ణయం తీసుకోనుంది. బోనస్ షేర్లను ప్రకటిస్తే.. అదే రోజున రికార్డు తేదీ తదితర వివరాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. గడచిన నెలరోజుల్లో స్టాక్ ధర 9 శాతానికి పైగా పెరిగింది. అలాగే ఆరు నెలల కిందట కంపెనీ షేర్లలో పెట్టుబడిపెట్టిన ఇన్వెస్టర్లు 16 శాతానికి పైగా రాబడిని పొందారు.
JTL ఇండస్ట్రీస్ షేర్ ధరలు గత ఏడాది కాలంలో 22 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.358గా ఉంది. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధరను పరిశీలిస్తే రూ.372.80గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 282 వద్ద ఉంది. ఈక్రమంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ JTL ఇండస్ట్రీస్ కంపెనీ స్టాక్‌పై 'BUY' రేటింగ్‌ను ఇచ్చింది.
JTL ఇండస్ట్రీస్ వ్యూహాత్మకంగా ఉన్న ప్లాంట్లు, దూకుడు సామర్థ్యం విస్తరణ, విలువ జోడింపు ప్రణాళిక ద్వారా విస్తృత పంపిణీదారులను కలిగి ఉంది. దేశంలో నాలుగు తయారీ కేంద్రాలను కలిగి ఉన్న కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలోనూ కస్టమర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications