Multibagger Stock: కేవలం టాప్ కంపెనీలుగా గుర్తింపు తెచ్చుకుని ఐటీ సంస్థలు మాత్రమే మంచి రాబడులను అందించవు. చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ మంచి పనితీరుతో మల్టీబ్యాగర్ రాబడులను అందించిన కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఆరియన్‌ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ గురించే. 2005లో రూ.10 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం ప్రస్తుతం రూ.659 కోట్లకు చేరుకుంది. కంపెనీలో 1.15 శాతం వాటా అంటే 2.63 లక్షల షేర్లను మలబార్ ఇండియా ఫండ్ బల్క్ డీల్ ద్వారా జూన్ 14న సగటు షేరు ధర రూ.880.23 చొప్పున కొనుగోలు చేసింది. కంపెనీ స్టాక్ తన ఇన్వెస్టర్లకు గడచిన మూడేళ్ల కాలంలో 1,439 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది.

మూడేళ్ల కిందట మల్టీబ్యాగర్ ఐటీ కంపెనీ షేర్ ధర రూ.56 వద్ద ఉండగా.. ఈరోజు స్టాక్ రూ.1010 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఉదయం కంపెనీ షేర్ రూ.1,039 వద్ద ఎన్ఎస్ఈలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎవరైనా ఇన్వస్టర్ దీర్ఘకాలిక పెట్టుబడిలో భాగంగా గతంలో రూ.లక్ష కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ రూ.18 లక్షలకు పైగానే ఉండేది. ఏడాది కాలంలో 240 శాతం మేర లాభపడిన కంపెనీ షేర్లలో మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏడుగురు ప్రమోటర్లు 33 శాతం వాటాలను కలిగి ఉండగా.. మిగిలిన 67 శాతం పబ్లిక్ హోల్డ్ చేస్తున్నారు.
Orionpro సొల్యూషన్స్ ఒక అధునాతన సాంకేతిక పరిష్కారాల సంస్థ. ఇది బ్యాంకింగ్, మొబిలిటీ, చెల్లింపులతో పాటు ప్రభుత్వ రంగాల అవసరాలను తీరుస్తుంది. మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 32.21 శాతం వృద్ధిని నమోదు చేసింది. 1997లో కార్యకలాపాలను ప్రారంభించిన కంపెనీ వెయ్యికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది.

Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications