Multicap funds: మల్టీ క్యాప్ ఫండ్స్ మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్.. నెలకు 10 వేలతో రాబడి ఎంతంటే..
Multicap funds: సాంప్రదాయక సేవింగ్స్ పథకాల కంటే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. కాంపౌండింగ్ బెనిఫిట్ కూడా కలిసి ఉండటంతో ప్రజలు మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇప్పటికే మంచి రాబడిని అందించాయి. ఇదే బాటలో మల్టీ క్యాప్ ఫండ్స్ ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
కొన్ని మల్టీ క్యాప్ ఫండ్స్.. దిమ్మ తిరిగిపోయే స్థాయిలో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ జనరేట్ చేశాయి. పదేళ్లో మొత్తం పెట్టుబడిని మూడింతలు చేసినవి కూడా ఉన్నాయి. ప్రముఖ ఫండ్ ట్రాకింగ్ వెబ్ సైట్ ప్రకారం దీర్ఘకాలిక మల్టీక్యాప్ ఫండ్స్.. డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్స్ గత 10 ఏళ్లలో యావరేజ్ గా 15 శాతం చొప్పున రిటర్న్ జనరేట్ చేశాయి.

ఈ విభాగంలో 22.50 శాతం రాబడితో క్వాంట్ యాక్టివ్ ఫండ్ ముందంజలో ఉంది. 10 ఏళ్ల పాటు నెలకు 10 వేల చొప్పున SIP చేస్తే, 33 లక్షలు జనరేట్ చేసి ఔరా అనిపిచింది. అంటే ఇన్వెస్ట్ చేసిన 12 లక్షలకు 33 లక్షలకు పైగా రాబట్టిందన్నమాట. ఇన్వెస్కో ఇండియా మల్టీక్యాప్ ఫండ్
19.71 శాతం వార్షిక ఆదాయాన్ని ఇచ్చింది.
బ్యాంకింగ్ రంగ దిగ్గజం ICICI ఆర్మ్ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ కూడా మంచి రాబడినే జనరేట్ చేసింది. 17.02 శాతం వార్షిక రిటర్న్ ఇచ్చింది. నెలనెలా 10 వేల చొప్పున పదేళ్ల పాటు మదుపు చేస్తే.. మొత్తం ఇన్వెస్ట్ చేసిన 12 లక్షలకు అదనంగా మరో 19 లక్షలకు పైగా జనరేట్ చేసింది. నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ 17.73 శాతం, సుందరం మల్టీ క్యాప్ ఫండ్ 17.30 శాతం రాబడి అందించి తదనంతర స్థానాల్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications