Mutual Funds: ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్‌కు కేరాఫ్ అడ్రస్.. మీరు ఇన్వెస్ట్ చేశారా మరి!
Mutibagger funds: ప్రజలు మెచ్చిన ప్రముఖ పెట్టుబడి సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతం ముందున్నాయి. తక్కువ కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ కావాలంటే సులువైన మార్గం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమేనని చాలా మంది బలంగా విశ్వసిస్తారు. చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టి ఒకేసారి భారీ కార్పస్ జాక్‌పాట్‌గా కొట్టాలంటే ఇదే సరైన రూట్ అని నమ్మేవారు కోకొల్లలు.
మ్యూచువల్ పండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఎంత ఎక్కువ రిస్క్ చేస్తే అంతగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. లార్జ్ మరియు మిడ క్యాప్ ఫండ్స్ కంటే స్మాల్ క్యాప్‌లో రిస్క్ కొంత ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే అవి భారీ స్థాయిలో నమ్మశక్యం కాని రిటర్నులను జనరేట్ చేసి ఔరా అనిపిస్తున్నాయి.

నెలకు కేవలం 20 వేల పెట్టుబడి పెడితే 10 ఏళ్లు తిరిగే సరికి కోటిని అందించిన స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. దశాబ్ద కాలంగా 27.24 శాతం భారీ రిటర్నులను అందించి హాట్ స్మాల్ క్యాప్ ఫండ్‌గా కొనసాగుతోంది. 10 ఏళ్లపాటు నెలకు 20 వేల ఇన్వెస్ట్‌మెంట్‌ను 1.24 కోట్ల భారీ కార్పస్‌గా మార్చిన ఘనత దీని సొంతం.
తదనంతర స్థానాల్లో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. ప్రతినెలా 20 వేల మదుపుతో తన పెట్టుబడిదారులకు 25.49 శాతం రిటర్నులతో 10 ఏళ్లలో 1.10 కోట్లను కూడబెట్టే అవకాశం కల్పించింది. 22.36 శాతంతో HSBC స్మాల్ క్యాప్ ఫండ్ కోటికి కొంచెం తక్కువగా 90 లక్షల రిటర్న్ జనరేట్ చేసింది. SBI స్మాల్ క్యాప్ ఫండ్ 22.05 శాతంతో 87 లక్షలను, 21.37 శాతంతో HDFC స్మాల్ క్యాప్ ఫండ్ 84 లక్షలను తిరిగిచ్చాయి.


Click it and Unblock the Notifications