Mukesh-Isha Ambani: భారత మార్కెట్లలో అతిపెద్ద వ్యాపార వాటాను హస్తగతం చేసుకునేందుకు అంబానీ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తునే ఉన్నారు. అయితే కూతురు ఇషా వ్యాపారంలోకి రాగానే ఆట వేగం పెరిగి వేటగా మారిపోయింది. త్వరలోనే మరో సంచలనానికి తెరతీసేందుకు రిలయన్స్ గ్రూప్ అధినేత పెద్ద స్కెట్ వేశారు.
ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా రిలయన్స్ రిటైల్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇషా ఎంట్రీ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీలోని రిటైల్ విభాగం సరికొత్త రికార్డులను సృష్టిస్తూ వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.20 లక్షల కోట్లకు సమీపానికి చేరుకుంది.2022 ఆగస్టులో ఇషా చేతికి వచ్చిన రిలయన్స్ రిటైల్ బిజినెస్ విలువ ప్రస్తుతం రూ.8 లక్షల కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల నాలుగో త్రైమాసిక ఫలితాల సమయంలో డేటా ప్రకారం తొలిసారిగా రిటైల్ విభాగం లాభం రూ.10,000 కోట్ల మార్కును అందుకుంది.

ఈ తరుణంలోనే ఇషా అంబానీ త్వరలోనే దేశంలోని బడ్జెట్ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ సొంత బ్రాండ్ కింద ఏసీలు, టీవీలతో పాటు ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ ఉత్పత్తులను విక్రయించేందుకు భారీ ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఇటీవల రిలయన్స్ రిటైల్ Wyzr పేరుతో సొంత బ్రాండింగ్ కింద ఎయిర్ కూలర్లను మార్కెట్లో విక్రయానికి తీసుకొచ్చింది. ఇదే క్రమంలో కంపెనీ తన పేరుపై వస్తువులను తయారు చేయించుకునేందుకు డిక్సన్ టెక్నాలజీస్, ఒనీడాకు చెందిన మిర్క్ ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలతో చర్చలు జరుపుతోంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ లాంచ్ చేస్తున్న ఉత్పత్తులు మార్కెట్లో గణనీయమైన ప్రజాధరణ పొందిన తర్వాత సొంతంగా తయారు చేసుకునేందుకు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నట్లు వెల్లడైంది. మార్కెట్లోని పోటీదారుల నుంచి వ్యాపారాన్ని గణనీయంగా లాక్కునేందుకు వాషింగ్ మెషిన్లు, రెఫ్రిజరేటర్లు, టీవీలు, చిన్నపాటి గృహోపకరణాలు, ఏసీలు, ఎల్ఈడీ బల్బులను కంపెనీ మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది.
రిలయన్స్ రిటైల్ ఈ ఉత్పత్తులను సొంతంగా రూపొందించడం, అభివృద్ధి చేసి.. రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లు, ప్రాంతీయ రిటైల్ చైన్‌లు, స్వతంత్ర డీలర్‌లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉత్పత్తులను పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. Wyzr ఉత్పత్తులు LG, Samsung, Whirlpool వంటి ప్రముఖ బ్రాండ్‌ల కంటే తక్కువ ధరను కలిగి ఉంటాయని తెలుస్తోంది. దీంతో రిలయన్స్ జియో ఫోన్లను తక్కువ ధరలకు అందించిన మాదిరిగానే హోమ్ అప్లయన్సెస్ మార్కెట్లో కూడా పెద్ద వాటాను కొల్లగొట్టడానికి సిద్ధమౌతుండటంతో ప్రత్యర్థి సంస్థల్లో ఇప్పటికే ఆందోళన మెుదలైంది. అంబానీ ఆట వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు చేరువ చేస్తుందా అనే విషయం త్వరలోనే తేలనుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications