Mukesh Ambani: జీతాలు చెల్లించలేని స్థితిలో అంబానీ స్టార్టప్.. పూర్తి వివరాలు..
Mukesh Ambani: ఇటీవల వ్యాపార విస్తరణలో ముఖేష్-ఇషా అంబానీలు చాలా చురుకుగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇషా రాకతో రిలయన్స్ రిటైల్ కొత్త పుంతలు తొక్కుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే ఒక తప్పు జరిగినట్లు కనిపిస్తోంది.
ముఖేష్ అంబానీ గత ఏడాది జనవరిలో దాదాపు రూ.1,641 కోట్ల పెట్టుబడి పెట్టి క్విక్-గ్రాసరీ డెలివరీ ప్రొవైడర్ డన్జోలో దాదాపు 25% వాటాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇషా అంబానీ నుంచి మరో రూ.164 కోట్లను సేకరించాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం కంపెనీ సిరీస్ G రౌండ్‌లో 80-100 మిలియన్ డాలర్లను ఫండింగ్ కోసం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడైంది.

బెంగళూరు స్టార్టప్ నిధుల సమీకరణ ద్వారా వచ్చే సొమ్ము వేతనాలు చెల్లించడంతోపాటు దాని విక్రేతల పెండింగ్ బకాయిలను కూడా చెల్లించడంలో సహాయపడుతుంది. Dunzo ఈ సంవత్సరం మార్చి నుంచి కనీసం ఏడు కంపెనీల నుంచి లీగల్ నోటీసులను అందుకుంది. వీటిలో గూగుల్ ఇండియా, నీలెన్సో, క్లోవర్ వెంచర్స్, ఫేస్‌బుక్ ఇండియా ఆన్‌లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, కప్‌షప్, కూ అండ్ గ్లాన్స్ ఉన్నాయి. విక్రేతలకు కంపెనీ బకాయిలు మెుత్తం రూ.11.4 కోట్లుగా ఉన్నట్లుగా ఉందని తెలుస్తోంది.
క్విక్-కిరాణా డెలివరీ ప్రొవైడర్ ఉద్యోగులకు జూన్ నుంచి నిలిపివేసిన జీతం కాంపోనెంట్‌పై ఏడాదికి 12 శాతం వడ్డీని చెల్లిస్తానని హామీ ఇచ్చింది. అంతేకాకుండా సెప్టెంబర్ 4 నాటికి అన్ని బాకీ ఉన్న అప్పులను చెల్లించే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్టార్టప్ వారికి హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఈ-మెయిల్ పంపింది. అందులో ఉద్యోగుల సహనానికి, నిరంతర మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే చెల్లింపుల ఆలస్యం వల్ల కలిగించిన అసౌకర్యాన్ని తాము అర్థం చేసుకున్నామని డన్జో తెలిపింది.


Click it and Unblock the Notifications