Mukesh Ambani: డబ్బు సంపాదించటానికి ఎలాంటి అవకాశం ఉన్నా దానిని వ్యాపారవేత్తలు అస్సలు వదిలిపెట్టరు. ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశారు రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ.
భారతదేశ ఆర్థిక వృద్ధిలో ఇంధనం, పరిశ్రమలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఇంధన వ్యాపారంలో దిగ్గజంగా ఉన్న రిలయన్స్ గ్రూప్ మరో కొత్త వ్యాపార అవకాశాన్ని చేజిక్కించుకుని ఆధిపత్యాన్ని చెలాయించేందుకు సిద్ధమయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చక్కెర మిల్లు యజమానులతో ఒకదాని తర్వాత మరొకదానితో మాట్లాడుతోంది.

ముడి చమురు శుద్ధి నుంటు బహుళ ఇంధనం, గ్యాస్ ఉత్పత్తి వరకు ప్రతిదానిపై దృష్టి సారించిన ముకేశ్ అంబానీ ప్రస్తుతం కంపురెస్ట్ బయోగ్యాస్ ఉత్పత్తిపై పని చేస్తున్నారు. ఈ పరిస్థితిలో బయోగ్యాస్ ఉత్పత్తికి ముడిసరుకు అయిన చెరుకు వ్యర్థాల సరఫరాపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ మాత్రమే కాకుండా దేశంలోని అనేక ఇతర వ్యాపార సంస్థలు వ్యవసాయ, ఆహార వ్యర్థాల నుంచి కంపురెస్ట్ బయోగ్యాస్ ఉత్పత్తి చేయడానికి కృషి చేస్తున్నాయి.
రిలయన్స్ బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం నేరుగా చక్కెర మిల్లుల నుంచి అనేక వేల టన్నుల పెద్ద బ్యాచ్‌లలో చెరకు ఫిల్టర్ ప్రెస్ స్లడ్జ్‌ను కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చెరకు ఫిల్టర్ ప్రెస్ మట్టిని రోజువారీగా సరఫరా పొందేందుకు ప్రయత్నిస్తోంది. రానున్న ఐదేళ్లలో 100 కంపురెస్ట్ బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు సెప్టెంబరులో ప్రకటించింది. ఈ ప్లాంట్లు 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలను ప్రాసెస్ చేసి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయని పేర్కొంది.
ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో బయోగ్యాస్ ప్లాంట్ నడుస్తోంది. కంపెనీ నిర్మించాలనుకుంటున్న కంపురెస్ట్ బయోగ్యాస్ ప్రతిరోజూ దాదాపు 250,000 టన్నుల చెరకు ఫిల్టర్ ప్రెస్ మట్టి అవసరమని తెలుస్తోంది. టన్ను చెరకు ఫిల్టర్ ప్రెస్ మడ్ ధర రూ.200 నుంచి రూ.500 వరకు పలుకుతోంది. అందుకే తక్కువ ఖర్చుతో ఎక్కువ మెుత్తంలో దీనిని గ్యాస్ ఉత్పత్తిలో వినియోగించాలని రిలయన్స్ గ్రూప్ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications