Mukesh Ambani: టాటాలకు స్పాట్ పెడుతున్న అంబానీ.. రూ.53,400 కోట్ల మెగా ప్లాన్..
Mukesh Ambani: రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముఖేష్ అంబానీ ఇటీవల అనేక వరుస డీల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా టాటాలను ఢీకొట్టేందుకు పెద్ద ప్లాన్ వేస్తున్నారు.
బిలియనీర్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోకి పెద్ద అంతర్జాతీయ బ్రాండ్‌లను తీసుకొస్తూనే ఉంది. తాజాగా వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ అనే భారీ UK ఫార్మాస్యూటికల్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. ఈ సంస్థ యూకే కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అనేక బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ.

ఈ అతిపెద్ద కంపెనీని కొనుగోలు చేయటం ద్వారా దాని ఔషధ దుకాణాలు, వ్యాపారాన్ని భారతదేశానికి తీసుకురావడానికి రిలయన్స్ గ్రూప్ పెద్ద ఎత్తుగడలు వేస్తోంది. అంతర్జాతీయ మందుల దుకాణం యూనిట్లు, రసాయన శాస్త్రవేత్తలను కొనుగోలుకు అంబానీ భారీ ఆఫర్ ఇచ్చారని వర్గాలు తెలిపినట్లు బ్లూమ్ బర్గ్ నివేదించింది.
నివేదికల ప్రకారం ముఖేష్ అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్ బ్రిటన్, యుఎస్‌లో ఉన్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ చైన్ బూట్‌లను కొనుగోలు చేయడానికి యుఎస్ ఆధారిత ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఇంక్‌తో కన్సార్టియంను ఏర్పాటు చేస్తోంది. అంబానీ కంపెనీ తన ఫార్మా బ్రాండ్ బూట్‌లను కొనుగోలు చేయడానికి వాల్‌గ్రీన్స్‌తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కంపెనీ విలువ భారతీయ కరెన్సీలో సుమారు దాదాపు రూ.53,400 కోట్లుగా ఉంది.

రిలయన్స్-వాల్‌గ్రీన్స్ ఒప్పందం విజయవంతమైతే.. అంబానీ దేశంలో కంపెనీని పరిచయం చేసి ఆన్‌లైన్ డ్రగ్ స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా లాభాలను పెంచుతారని తెలుస్తోంది. దీని ద్వారా టాటాలకు చెందిన టాటా 1MGకి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. ఇదే పోటీలో దిగ్గజం అపోలో ఫార్మసీ యాప్ కూడా ఉంది. త్వరలోనే డీల్ పరిణామాలకు సంబంధించి రిలయన్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications