Mukesh Ambani: ప్రపంచం వేగంగా అన్ని రంగాల్లో ఏఐ సాంకేతికతలను అందిపుచ్చుకుంటున్న వేళ దానికి అనుగుణంగా భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ కొత్త ఉత్పత్తులతో ప్రజల ముందుకు జియోను తీసుకొస్తున్నారు. ఆగస్టు 29, 2024న జరిగిన 47వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (AGM)లో ముఖేష్ అంబానీ ఎనర్జీ నుంచి ఎంటర్‌టైన్మెంట్ వరకు విస్తరించి ఉన్న రిలయన్స్ వ్యాపారాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు.
ముందుగా ఏజీఎంలో జియో మెుబైల్ సేవల గురించి మాట్లాడుతూ.. జియో ఇప్పుడు మొబైల్ ట్రాఫిక్‌లో 8 శాతాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డేటా టారిఫ్ రేట్లలో కేవలం 1/4వ వంతుకు డేటాను అందిస్తున్నట్లు చైర్మన్ ముఖేష్ వెల్లడించారు. సగటు భారతీయ జియో యూజర్ నెలకు 30 జీబీ వరకు ఇంటర్నెట్ వాడుతున్నట్లు చెప్పారు. దేశంలోని 5జీ యూజర్లలో దాదాపు 85 శాతం జియో కస్టమర్లేనని చెప్పారు. జియోఎయిర్‌ఫైబర్‌లో 100 మిలియన్ల హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లను జోడించాలని చూస్తోందని చెప్పారు.

అంబానీ జియో బ్రెయిన్ గురించి మాట్లాడుతూ ఏఐ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. దేశీయ మార్కెట్ కోసం AI టూల్స్ సూట్ అయిన జియో బ్రెయిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇతర రిలయన్స్ ఆపరేటింగ్ కంపెనీలలో కూడా ఇదే విధమైన పరివర్తనను తీసుకొస్తున్నట్లు చెప్పారు. అలాగే జియో ఏఐ క్లౌడ్ సేవల గురించి భారీ ఆఫర్ ప్రకటిస్తూ.. ప్రతి వినియోగదారుడికి దీపావళి నుంచి వెల్‌కమ్ ఆఫర్ కింద 100GB క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్‌ను అందించనున్నట్లు అంబానీ చెప్పారు. అలాగే జియో ఫోన్‌కాల్ AI సాంకేతికత యూజర్లకు తమ కాల్‌ని డైరెక్టుగా జియో క్లౌడ్‌లో రికార్డ్ అండ్ స్టోరేజ్ అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. అలాగే ఈ కాల్స్ ఆటోమెటిక్ గా ట్రాన్స్ క్రైబ్, ఇతర భాషల్లోకి అనువదించగలదని జియో వెల్లడించింది.
ఇక ఏజీఎంలో అంబానీ తనయుడు ఆకాష్ జియో టీవీఓఎస్ ను పరిచయం చేశారు. ఇది జియో సెట్ టాప్ బాక్స్ కోసం స్వదేశీ పరిజ్ఞానంతో తెచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ అని వెల్లడించారు. అలాగే దీనిని జియో హోమ్ తో పూర్తిగా అనుసంధానించినట్లు చెప్పారు. JioTvOS అల్ట్రా HD 4K వీడియో, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ వంటి అత్యాధునిక హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్‌లకు మద్దతునిస్తుందని తెలిపారు. ఇక ఇదే సమయంలో ఆవిష్కరించబడిన JioTV+ వినియోగదారులకు లైవ్ టీవీ, ఆన్-డిమాండ్ షోస్, యాప్‌లను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందిస్తుంది. JioTV+ హై డెఫినిషన్‌లో 860కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుందని వెల్లడించారు.
ఈ క్రమంలో జామ్‌నగర్‌లో గిగావాట్-స్కేల్ AI-రెడీ డేటా సెంటర్‌ను రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ అందించనుందని ముఖేష్ ప్రకటించారు. అలాగే ఏజీఎం ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన పెట్టుబడిదారులకు 1:1 రేషియోలో బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించినట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్స్ ప్రకారం వెల్లడైంది. దీనికోసం సెప్టెంబర్ 5ను రికార్డు తేదీగా వెల్లడించింది. దీంతో కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడేలో భారీగా పెరుగుదలను చూశాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications