Jio Star: దేశంలో అతిపెద్ద మీడియా దిగ్గజంగా ముఖేష్ అంబానీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. చాలా కాలంగా చూస్తున్న రిలయన్స్ డిస్నీల విలీన ప్రక్రియ పూర్తయింది. వాస్తవానికి దేశంలోని మీడియా పరిశ్రమ చరిత్రలో ఇదొక గుర్తించదగిన మైలురాయిగా చెప్పుకోవచ్చు.
వివరాల్లోకి వెళితే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, వయాకామ్18, స్టార్ ఇండియా కలిసి దేశంలోనే అతిపెద్ద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీని సృష్టించాయి. ఈ వెంచర్ మొత్తం విలువ రూ.70,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. ఈ కలయిక ద్వారా ఏటా రూ.26 వేల కోట్ల ఆదాయం జనరేట్ అవుతుందని అంచనా వేయబడింది. నీతా అంబానీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వృద్ధి కోసం రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ మెజా మెర్జర్ కోసం ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వంటి అధికారుల నుంచి ఆమోదాలు వచ్చిన సంగతి తెలిసిందే.

డీల్ వివరాల ప్రకారం కొత్తగా ఏర్పడిన కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం, వయాకామ్ 18కి 16.34 శాతం వాటాను హోల్డ్ చేయనున్నాయి. ప్రధానంగా కొత్తగా ఏర్పాటైన ఈ కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మెజారితీ వాటాలను కలిగి ఉండటంతో నియంత్రణను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఉదయ్ శంకర్ జాయింట్ వెంచర్‌కు వ్యూహాత్మక మార్గదర్శకాలను అందించే వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కొత్తగా ఏర్పాటైన ఈ సంస్థ వివిధ భాషల్లో ఏకంగా 100 కంటే ఎక్కువ ఛానళ్లను కలిగి ఉండనుంది. పైగా ఏటా 30,000 గంటల టీవీ వినోద కంటెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ విషయానికి వస్తే జియో సినిమా, హాట్ స్టార్ సంయుక్తంగా 5 కోట్ల కంటే ఎక్కువ కస్టమర్ బేస్ కలిగి ఉంది. పైగా ఇవి అత్యధిక కస్టమర్ బేస్ కలిగి ఉన్న క్రికెట్, ఫుట్‌బాల్ సహా మరిన్ని క్రీడలకు సంబంధించిన ప్రసార హక్కులను కలిగి ఉన్నాయి. ఇదే క్రమంలో వయాకామ్ 18లో అమెరికాకు చెందిన పారామౌంట్ గ్లోబల్ కి ఉన్న 13.01 శాతం వాటాను రూ.4,286 కోట్లకు రిలయన్స్ కొనుగోలు చేయటంతో మరో పెద్ద అడుగువేసింది. ఈ చర్యలు కంపెనీపై పూర్తి స్థాయిలో పట్టుసాధించటానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న కంపెనీకి ఏకంగా ముగ్గురు సీఈవోలు ఉంటారని తెలుస్తోంది. కెవిన్ వాజ్, కిరణ్ మణి, సంజోగ్ గుప్తా నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. తాజా పరిణామాలు అంబానీకి చెందిన రిలయన్స్ షేర్లను బలపరిచి ర్యాలీకి దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications