Mukesh Ambani: కనికరం కోల్పోయిన ముఖేష్ అంబానీ.. అనంత్ పెళ్లి తర్వాత షాకింగ్ విషయాలు..
Ambani News: ఇటీవల అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపేందుకు ముఖేష్ అంబానీ దాదాపు రూ.5,000 కోట్లకు పైనే వెచ్చించారు. అయితే రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులపై మాత్రం కనికరం చూపటం లేదని తాజా డేటా చెబుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం వ్యాపారాలను ప్రభావితం చేస్తోంది. ఈ క్రమంలో ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన మాంద్యం భయాలు కంపెనీలను కాస్ట్ కటింగ్ వైపు నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా గడచిన ఏడాది కాలంలో భారీగా ఖర్చులను తగ్గించుకున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో కంపెనీ మెుత్తం ఉద్యోగుల సంఖ్య 3,89,000 నుంచి 3,47,000కి తగ్గినట్లు ప్రకటించింది.

ఖర్చుల మదింపులో భాగంగా రిలయన్స్ రిటైల్ వర్టికల్‌లో గరిష్ఠంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించబడినట్లు వెల్లడైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ FY24లో ఉద్యోగుల సంఖ్యను దాదాపు 11% లేదా 42,000 తగ్గించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా వార్షిక నివేదిక ప్రకారం కొత్త నియామకాలు మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా తగ్గి 1,70,000కి చేరుకున్నాయి. కంపెనీ ఎక్కువగా ఉద్యోగులను తమ రిటైల్ వ్యాపారం నుంచి తగ్గించినట్లు డేటా వెల్లడించింది. ఈ క్రమంలో రిలయన్స్ టెలికాం వెంచర్ జియో కూడా FY24లో 90,000 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. ఉద్యోగులకు అందించే సౌకర్యాలపై వ్యయం 3% పెరిగి రూ.25,699 కోట్లకు చేరుకుంది.
జియో స్టూడియోస్, మీడియా అండ్ కంటెంట్ విభాగం 11 థియేట్రికల్ ఫిల్మ్‌లు, 35 డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, భాషలు జానర్‌లలో ఎనిమిది ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఈ సంఖ్య దేశంలోని ఏ ఫిల్మ్ స్టూడియో కంటే పెద్దది. వరుసగా 8 హిట్‌లతో, జియో స్టూడియోస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రూ.700 కోట్లను రాబట్టాయి. 2023-24 నాలుగో త్రైమాసికంలో ప్రతి రెండవ చిత్రం జియో స్టూడియోస్ చిత్రం కావటం గమనార్హం.


Click it and Unblock the Notifications