Mukesh Ambani: ఆయిల్ నుంచి టెలికాం, రిటైల్ వరకు అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన క్యూ1 ఫలితాలను నేడు ప్రకటించింది. ఈ క్రమంలో రిలయన్స్ లాభం ఏడాది ప్రాతిపదికన 4 శాతం క్షీణతను చూసింది. ఇటీవల చిన్న కుమారుడు అనంత్ వివాహంతో సంతోషంలో ఉన్న అంబానీ ఫ్యామిలీకి ఇది నిజంగా చేదు వార్తని చెప్పుకోవాలి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్సూలిడేటెడ్ లాభం ఏడాది ప్రాతిపధికన 4 శాతం క్షీణించి ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో రూ.17,448 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.18,182 కోట్లుగా నమోదైంది. అయితే కంపెనీ ఆదాయాలను పరిశీలిస్తే.. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2,31,132 కోట్ల కంటే 11.5 శాతం పెరిగి పరిశీలనలో ఉన్న త్రైమాసికంలో రూ.2,57,823 కోట్లకు చేరుకుందని కంపెనీ తన స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో పేర్కొంది. ఇదే క్రమంలో కంపెనీ అప్పులు రూ.3,04,937 కోట్లకు తగ్గాయని ఆర్‌ఐఎల్ పేర్కొంది.

రిలయన్స్ జియో:
ఈ త్రైమాసికంలో జియో ప్లాట్‌ఫారమ్స్ పన్ను తర్వాత లాభం రూ.5,698 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. జూన్ త్రైమాసికంలో టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఒక్కో వినియోగదారుకు సగటు ఆదాయం(APRU) రూ.181.70గా ఉన్నట్లు ప్రకటించింది. అలాగే రిలయన్స్ రిటైల్ లాభం త్రైమాసికంలో రూ.2,549 కోట్లుగా నమోదైంది. రిటైల్ మొత్తం ఆదాయంలో 18 శాతాన్ని ఛానెల్‌లు అందించడంతో డిజిటల్ కామర్స్, కొత్త వాణిజ్యాన్ని పెంచడంపై దృష్టి సారించింది. రిజిస్టర్డ్ రిటైల్ కస్టమర్ బేస్ 316 మిలియన్లకు పెరిగిందని ఆర్‌ఐఎల్ తెలిపింది.
అంబానీ కామెంట్స్:
డిజిటల్ సేవల వ్యాపారం సంవత్సరానికి అద్భుతమైన ఆర్థిక పనితీరును నమోదు చేసిందని అంబానీ చెప్పారు. దాని సానుకూల వృద్ధి ఊపందుకుంటున్నారు. దేశంలో జియో ట్రూ 5G నెట్‌వర్క్ 85 శాతం కవర్ కలిగి ఉందన్నారు. అలాగే రిటైల్ వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే బలమైన ఆర్థిక ఫలితాలను అందించిందని అంబానీ చెప్పారు. కంపెనీ తన రిటైల్ పాదముద్ర దేశంలో వేగవంతమైన విస్తరణతో మిలియన్ల మంది భారతీయులకు ఇష్టపడే రిటైలర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కొనసాగిస్తోందని చెప్పారు. అలాగే న్యూ ఎనర్జీ గిగా-ఫ్యాక్టరీల అమలులో రిలయన్స్ ఇండస్ట్రీస్ గణనీయమైన పురోగతిని సాధించిందని పేర్కొన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications