Mukesh Ambani: విదేశంలో కంపెనీని పెట్టిన ముఖేష్ అంబానీ.. ఆ వ్యాపారమే టార్గెట్..!
Reliance Industries: ఇన్నాళ్లుగా ఇండియాను ఏలాలని నిర్ణయంతో ముందుకు సాగిన ముఖేష్ అంబానీ తన వారసుల రాకతో రిలయన్స్ వ్యాపారాలను ప్రపంచ స్థాయిలోనూ ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా అనేక ఆయన కొన్ని చర్యలు చేపట్టారు. స్వదేశంలో కూడా వరుసగా కంపెనీలను కొనుగోలు చేస్తున్న అంబానీ ముందుకు సాగుతున్నారు.
అంబానీ నేతృత్వంలో కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ సింగపూర్‌లో REC సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ అనే అనుబంధ సంస్థను తాజాగా ప్రారంభించింది. దీంతో కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద ఆటకు వ్యూహాలతో సిద్ధమైందని నిపుణులు భావిస్తున్నారు. సింగపూర్‌లో ప్రారంభించబడిన సంస్థను రిలయన్స్ ఇండస్ట్రీస్ పునరుత్పాదక అండ్ స్థిరమైన ఇంధన విభాగాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పనులకు ఉపయోగించనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సింగపూర్‌లో నిర్వహించనున్న కేంద్రం అంతర్జాతీయంగా నైపుణ్యం కలిగిన అనేక మందికి ఉపాధి కల్పిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ పునరుత్పాదక ఇంధన రంగ కార్యకలాపాలకు సంబంధించిన ఆర్ అండ్ డీ పనులు సాంకేతికంగా ఇక్కడ నిర్వహించబడతాయని వెల్లడైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి అడుగుగా అనుబంధ సంస్థలో లక్ష డాలర్లను పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది. రిలయన్స్ సింగపూర్‌లో తన అధునాతన సౌర సాంకేతిక ప్రయోగశాలను కూడా విస్తరించింది. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనర్జీ, న్యాచురల్ గ్యాస్, పెట్రోకెమికల్స్, రిటైల్, ఫ్యాషన్, మీడియా, బెవరేజెస్, టెలికాం, ఎంటర్టైన్మెంట్ వంటి అనేక రంగాల్లో తన వ్యాపారాలను విజయవంతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
క్యాపిటల్ మార్కెట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం అతిపెద్ద మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థగా కొనసాగుతోంది. గత ఏడాది కంపెనీ తన ఫైనాన్స్ వ్యాపారాన్ని జియో ఫైనాన్షియల్స్ పేరుతో విడదీసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో కంపెనీ తన రిటైల్, టెలికాం వ్యాపార విలువను అన్ లాక్ చేసేందుకు వీలుగా డీమెర్జ్ చేయవచ్చనే గుసగుసలు కూడా చాలా కాలంగా మార్కెట్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ గ్రూప్ 1958లో ముఖేష్ తండ్రి ధీరూభాయ్ అంబానీ చేత స్థాపించబడిన సంగతి తెలిసిందే.
2024లో రిలయన్స్ గ్రూప్ మెుత్తంగా దాదాపు రూ.10 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, నెట్‌వర్క్ 18, అలోక్ ఇండస్ట్రీస్, రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ మొదలైన వివిధ అనుబంధ సంస్థలు గ్రూప్ కింద తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అంబానీ తనయులకు వ్యాపార బాధ్యతలు అందించిన తర్వాత కొత్త విస్తరణను రిలయన్స్ గ్రూప్ వ్యాపారాలు గతంలో ఎన్నడూ చూడని వేగంతో ముందుకు సాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications