ఆసియాలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన వ్యాపార నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకున్న ప్రతిభకు నిదర్శనంగా, దాదాపు ఒక దశాబ్దం క్రితం జియోను ప్రారంభించి ప్రపంచానికి తన సక్సెస్ చూపించారు. ప్రస్తుతం జియోకు 40 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. కోవిడ్ సమయంలో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నప్పుడు, ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల నుండి బిలియన్ల డాలర్లు సేకరించి, తన కంపెనీలలో వాటాలను విక్రయించి లోబ్ రిలీఫ్ పొందారు. ఇప్పుడు మరోసారి 500 కోట్ల చిన్న పెట్టుబడి నుండి 9,000 కోట్లకు పైగా సంపాదించి 2200% రాబడిని సాధించారు.

ఆసియన్ పెయింట్స్ నుండి 9,000 కోట్ల సంపాదన: ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), ఏషియన్ పెయింట్స్‌లో తనకున్న మొత్తం వాటాను విక్రయించి బయటకు వచ్చేసింది. ఈ నిష్క్రమణ ద్వారా రిలయన్స్ ఏకంగా 9,080 కోట్లను ఆర్జించింది. సుమారు 17 సంవత్సరాల క్రితం అంటే జనవరి 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో RIL తన అనుబంధ సంస్థ సిద్ధాంత్ కమర్షియల్స్ ద్వారా కేవలం 500 కోట్లకు ఏషియన్ పెయింట్స్‌లో 4.9 శాతం వాటాను కొనుగోలు చేసింది.
తాజాగా జూన్ 2024 (గత వారం)న RIL ఏషియన్ పెయింట్స్‌లోని 3.50 కోట్ల షేర్లను SBI మ్యూచువల్ ఫండ్‌కు ఒక్కో షేరుకు రూ.2,201 చొప్పున రూ.7,704 కోట్లకు విక్రయించింది. ఆ తరువాత జూన్ 2024 (సోమవారం)న మిగిలిన 87 లక్షల ఈక్విటీ షేర్లను ICICI ప్రుడెన్షియల్ లైఫ్ మ్యూచువల్ ఫండ్‌కు ఒక్కో షేరుకు సగటున రూ. 2,207.65 చొప్పున రూ.1,876 కోట్లకు విక్రయించి, పెయింట్ దిగ్గజం నుండి పూర్తిగా నిష్క్రమించింది. ఈ 17 సంవత్సరాలలో ముఖేష్ అంబానీ ఏషియన్ పెయింట్స్ షేర్ల నుండి 2,200% అద్భుతమైన రాబడిని పొందారు.
క్లిష్ట పరిస్థితుల్లోనూ తెలివైన నిర్ణయం: ఆసియన్ పెయింట్స్ గత రెండు సంవత్సరాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. షేర్లు 30 శాతానికి పైగా క్షీణించి, బ్లూ చిప్ స్టాక్‌లలో అత్యంత చెత్త పనితీరు కనబరిచింది. ఆదిత్య బిర్లా గ్రూప్ బిర్లా ఓపస్ పెయింట్స్ వంటి పోటీదారుల నుండి తీవ్ర పోటీ పట్టణ డిమాండ్ మందగించడం, తక్కువ ముడిసరుకు ఖర్చులు ఉన్నప్పటికీ మార్జిన్ ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ముఖేష్ అంబానీ కంపెనీ నుండి నిష్క్రమించడం ఆయన వ్యాపార దార్శనికతకు నిదర్శనం.
రిలయన్స్ వ్యూహంపై పెట్టుబడిదారుల నమ్మకం: పెట్టుబడిదారులు RIL తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃస్థాపనలో భాగంగా చూస్తున్నారు. మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు రిలయన్స్ AI మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు 2026 నాటికి ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయని అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ ROCE (రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్) లో మెరుగుదలపై విశ్వాసం పెరగడంతో కంపెనీ రీ-రేటింగ్ వేగవంతం అవుతుందని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి.
ఆసియన్ పెయింట్స్ ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, 60కి పైగా దేశాలలో 74,129 డీలర్ల అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో గొప్ప మార్కెట్ ఉనికితో ఉంది. ముఖేష్ అంబానీ సరైన మార్కెట్ సమయాన్ని ఎంచుకుని భారీ లాభాలతో ఈ పెట్టుబడి నుండి బయటపడ్డారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications