Mukesh Ambani: ఆ అంబానీ షేరులో తుఫాను పెరుగుదల.. ఐదింతలు రిటర్న్..
Lotus Chocolate Stock: భారత సంపన్న వ్యాపారుల జాబితాలో ఎన్ని పేర్లు వచ్చినా మాయమైన చెదరకుండా నిలిచిన వ్యక్తి ముఖేష్ అంబానీ. వ్యాపారం విషయంలో తన తండ్రి నుంచి పొందిన మెళకువలు ఆయనను తన విజయపరంపరను కొనసాగించేందుకు దోహదపడిందటారు నిపుణులు. దీనికి తోడు ఆయనకు ఉన్న ముందు చూపు కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించేందుకు ప్రేరేపించింది.
తాజాగా అంబానీకి చెందిన లోటస్ చాక్లెట్స్ స్టాక్ బలమైన పెరుగుదలను చూసింది. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ ధర రూ.1854ను తాకింది. దీంతో కంపెనీ షేర్లు కూడా తమ కొత్త 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గడచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు 21 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను చూశాయి. అలాగే గడచిన నెలలో కంపెనీ షేర్ ధర 165 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ల ధర రూ.699.05 స్థాయి నుంచి రూ.1850 స్థాయికి పెరిగాయి.

2024లో ఇప్పటివరకు లోటస్ టాక్లెట్స్ స్టాక్ తన పెట్టుబడిదారులకు 500% కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఏడాది ప్రారంభంలో జనవరి 1, 2024న లోటస్ చాక్లెట్ షేర్లు రూ.303.50 వద్ద ఉన్నాయి. అయితే ప్రస్తుతం 14 ఆగస్టు 2024న కంపెనీ షేర్లు రూ.1854కి బుల్ ర్యాలీలో ఎగబాకాయి. అలాగే గత 6 నెలల్లో లోటస్ చాక్లెట్ కంపెనీ షేర్లు 431% పెరిగాయి. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,380 కోట్లకు చేరుకుంది. అలాగే రెండేళ్ల కాలంలో కంపెనీ షేర్లు 1300 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి. ఈ క్రమంలో ఆగస్టు 12, 2022లో ఒక్కో షేరు ధర రూ.131.05 వద్ద నుంచి ప్రస్తుతం రూ.1854కి చేరుకున్నాయి. అలాగే ఐదేళ్ల కిందట కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.15 వద్ద మాత్రమే ఉన్నాయి.
లోటస్ చాక్లెట్ కంపెనీ ప్రధానంగా చాక్లెట్లు, కోకో ఉత్పత్తులను తయారు చేస్తుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ పూర్తి అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మే 24, 2023న లోటస్ చాక్లెట్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ.


Click it and Unblock the Notifications