భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో అడ్వాన్స్డ్ 5.5G నెట్‌వర్క్‌ను పరిచయం చేసింది, ఈ నెట్వర్క్ 10Gbps వరకు సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తోంది. జియో అడ్వాన్స్డ్ 5.5G నెట్‌వర్క్ జియో ప్రస్తుత 5G సేవలకు గొప్ప అప్‌గ్రేడ్‌ని సూచిస్తుంది, అలాగే యూజర్లకు మెరుగైన కనెక్టివిటీ అండ్ మంచి నెట్‌వర్క్ అందించనుంది.
జియో 5.5G నెట్‌వర్క్
జియో 5.5G నెట్‌వర్క్ అనేది 5G సేవలకి అడ్వాన్స్డ్ వెర్షన్. ప్రస్తుత 5Gతో పోలిస్తే ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్, లో లాటెన్సీ ఇంకా మెరుగైన నెట్‌వర్క్ రిలయాబిలిటీ అందిస్తుంది. ఈ టెక్నాలజీలో ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఉంటుంది అలాగే ఒకే సమయంలో వివిధ టవర్‌లకు కనెక్ట్ చేయగల మూడు విభిన్న నెట్‌వర్క్ సెల్స్ ఉపయోగిస్తుంది. దీని ద్వారా యూజర్లు అత్యధికంగా 10Gbps డౌన్‌లోడ్ స్పీడ్ అలాగే 1Gbps వరకు అప్‌లోడ్ స్పీడ్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.

వన్ ప్లస్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యేకం
జియో సహకారంతో ప్రారంభించిన వన్ ప్లస్ 13 సిరీస్ జియో 5.5G సేవలకు సపోర్ట్ చేసే వాటిలో మొదటిది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకంగా Jio అడ్వాన్స్డ్ నెట్‌వర్క్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది, ఇవి 5.5Gకి అనుకూలంగా ఉంటాయి. OnePlus 13 సిరీస్ సమయంలో Jio 5.5G సేవలను ప్రదర్శించింది, ఈ టైంలోనే డౌన్‌లోడ్ స్పీడ్ సాధించింది. Jio నాన్-3CC కాంపోనెంట్ క్యారియర్‌లో డౌన్‌లింక్ స్పీడ్ 277.78 Mbpsకి చేరుకుంది, అయితే 3CC కాంపోనెంట్ క్యారియర్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ 1,014.86 Mbpsకి పెరిగింది.
5G నుండి 5.5Gని ఎలా వేరు చేస్తుంది?
5.5G సర్వీస్ స్టాండర్డ్ 5G కంటే గొప్ప మెరుగుదలలను అందిస్తుంది వీటిలో:
అధిక స్పీడ్: డౌన్‌లోడ్ స్పీడ్ అతధికంగా 10Gbps, అప్‌లోడ్ స్పీడ్ 1Gbps.
లో లాటెన్సీ: స్మూత్ అండ్ ఫాస్ట్ కనెక్టివిటీని అందిస్తుంది.
వివిధ కనెక్షన్‌లు: వివిధ టవర్‌లకు ఒకే సమయంలో లింక్‌ల ద్వారా మెరుగైన కనెక్టివిటీ.
Jio 5.5G టెక్నాలజీ యూజర్ల కోసం ఇంటర్నెట్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని, స్ట్రీమింగ్, గేమింగ్ అండ్ ఆన్‌లైన్‌లో వర్క్ చేయడం వంటి పనులను వేగవంతంగా అలాగే అతుకులు లేకుండా చేస్తుంది. అయితే జియో 5.5Gకి సంబంధించి ప్లాన్స్ లేదా ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications