JIO Financial: ప్రస్తుతం అంబానీ ఫోకస్ తన ఫైనాన్స్ వ్యాపారంపైకి మారింది. ఇండియాలో ఫైనాన్స్ వ్యాపారానికి ఉన్న విలువ, డిమాండ్ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలతో పోటీ పడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ అయ్యింది జియో ఫైనాన్సియల్స్. ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసిన తర్వాత దీనిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముఖేష్ అంబానీ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పెట్టుబడి సంస్థ బ్లాక్‌రాక్‌తో కలిసి జాయించ్ వెంచర్ ద్వారా కొత్త వ్యాపారాన్ని విజయపధాన నడిపించాలని నిర్ణయించారు. ఇది కీలకమైన, వ్యూహాత్మకమైన వ్యాపార నిర్ణయంగా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అంబానీ ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మ్యానేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. 2018 తర్వాత అమెరికా ప్రఖ్యాత కంపెనీ తాజా చర్యతో తిరిగి భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. US-ఆధారిత పెట్టుబడి దిగ్గజం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(JFS) కలిసి అసెట్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని సృష్టించడానికి 50:50 నిష్పత్తి ప్రాతిపధికన జాయింట్ వెంచర్‌ను సృష్టిస్తోంది.
కొత్త జాయింట్ వెంచర్ ఏర్పాటుకు రెండు సంస్థలు సంయుక్తంగా 300 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నాయి. చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత వీరి జాయింట్ వెంచర్ మెుదలవుతుందని వెల్లడైంది. భారత అసెట్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా బ్లాక్ రాక్ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం జియో ఫైనాన్సియల్స్ మార్కెట్ క్యాప్ దాదాపు 20 బిలియన్ డాలర్లుగా లెక్కించబడింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications