Mukesh Ambani: దేశంలో అగ్రవ్యాపారవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ ఏ పనినైనా ముందుచూపుతోనే చేస్తుంటారు. అందుకే ఆయన ఇన్ని దశాబ్ధాలుగా తన తండ్రి ధీరూ భాయ్ అంబానీ నిర్మించిన సామ్రాజ్యాన్ని విజయవంతంగా ముందుకు నడుపుతున్నారు.
అయితే గత ఏడాది నుంచి రిలయన్స్ గ్రూప్ తన వ్యాపారాన్ని చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనేక పెట్టుబడులను పెడుతోంది. ఇందులో భాగంగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ జూలై 2021లో JustDial కంపెనీలో 67 శాతం వాటాను రూ.5,700 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ జరిగి రెండేళ్లు గడుస్తున్నా అంబానీ లక్ష్యం దిశగా అడుగులు పడటం లేదని తెలుస్తోంది.

జస్ట్ డయల్ వద్ద దాదాపు మూడున్నర కోట్ల మంది వ్యాపారాలకు సంబంధించిన లిస్టింగ్‌ల డేటాబేస్ ఉంది. అలాగే మార్చి 31, 2021 నాటికి కంపెనీ వద్ద 129.1 మిలియన్ల ప్రత్యేక వినియోగదారుల డేటా కలిగి ఉంది. అయితే ఈ ట్రాఫిక్ వాడుకోవటంలో రిలయన్స్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. జస్ట్ డయల్ బోర్డులో రిటైల్ వెంచర్స్ నుంచి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ వ్యాపార నిర్వహణలో వ్యవస్థాపకులు VSS మణి, అభిషేక్ బన్సల్ ఆధిపత్యం కొనసాగుతోందని వెల్లడైంది. అలాగే కంపెనీ తన ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ టీమ్ నుంచి 100 మందిని లేఆఫ్ చేసింది.
దేశం వేగంగా డిజిటలీకరణ వైపు పయనిస్తున్న వేళ.. జరుగుతున్న వ్యాపార వాతావరణం మార్పు కంటే చాలా నెమ్మదిగా మణి కంపెనీని నడుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త లోకల్ ఎకానమీలోకి విస్తరించాలని జస్ట్ డయిల్ చేస్తున్న ప్రయత్నాలు నిధుల విబేధాలతో పునఃపరిశీలనలో ఉన్నాయి. బోర్డు స్థాయిలోనే రిలయన్స్ గ్రూప్ ప్రమేయం ఉంటుందని.. జస్ట్ డయల్ స్వతంత్ర లిస్టెడ్ సంస్థగా కొనసాగుతుందని బన్సాల్ ఇటీవల ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ చెప్పారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని.. వ్యాపారాన్ని వీలైనంత త్వరగా తిరిగి గాడిలోకి తెచ్చేందుకు కొత్త రీసెల్లింగ్ మోడల్ తో ముందుకు రానున్నట్ల బన్సాల్ తెలిపారు.
ప్రస్తుతం జస్ట్ డయిల్ కంపెనీ షేరు రూ.737 వద్ద ఉంది. గడచిన ఏడాది కాలంలో స్టాక్ 30 శాతానికి పైగా రాబడిని అందించింది. అయితే అంబానీ లక్ష్యాలకు అనుగుణంగా కంపెనీ నడవటం లేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications